Home

»

Latest News

Dhurandhar 2: బాలీవుడ్ దండయాత్ర.. టాలీవుడ్ కి ముప్పు

Mar 23, 2026

 

 

-ధురంధర్ 2 కి తెలుగు సినిమాకి సంబంధం ఏంటి!
-తెలుగు సినిమాకి గట్టి పోటీ ఏర్పడనుందా
-ధురంధర్ 2 తో తెలుగు సినిమా తెసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి!

నిజానికి, సినిమా పప్రంచం ఎప్పుడూ ఊహించని మలుపులతో, రికార్డులతో నిండి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ నుండి వచ్చిన ధురంధర్ 2(Dhurandhar 2)తో అదే జరుగుతోంది. ధురంధర్2  ది రివెంజ్" విడుదలై మొదటి వారాంతంలోనే బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తుంది. రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ నుంచి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వరుసగా రెండు రోజులు 100  కోట్ల నెట్ వసూళ్ళు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

దీంతో ఇప్పుడు ఈ చిత్రం మన టాలీవుడ్కి ఒక హెచ్చరికగా కూడా పరిగణించవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మనం బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ చిత్రాలు కూడా  దక్షిణాది మార్కెట్ పై దృష్టి సారిస్తున్నాయి. ఈ కోవలోనే ధురంధర్2 ఇప్పుడు తెలుగునాట రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ధురంధర్2 విజయం దక్షిణాది సినీ ప్రియులు ఉత్తర భారతీయ సినిమాలని ఎంతగానో ఆదరిస్తున్నారనడానికి ఒక నిదర్శనం. ఇది మన తెలుగు చిత్రపరిశమ్రకి  మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కథాంశాల విషయంలో, నిర్మాణ విలువల్లో, మరియు మార్కెటింగ్ వ్యూహాలలో కొత్తదనంతో ముందుకు సాగాలి. అగ్రనటులని, సాంకేతిక నిపుణులని  సంపద్రించి, భారీ బడ్జెట్తో  సినిమాలు నిర్మించాలి.

ఇక ధురంధర్2  విజయం రణవీర్ సింగ్(Ranveer Singh)కెరీర్‌కి ఎంతో ఉపయోగకరంగా మారింది. గతంలో ఆయన కొన్ని విజయాలు సాధించినా, అవన్నీ ఒక ఎత్తు. ధురంధర్2నే ఒక ఎత్తు.  రణవీర్ యొక్క నటన, యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక విలువలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విజయం ఆయన మార్కెట్ విలువని మరింత పెంచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రణవీర్ మరిన్ని భారీప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఉంది.

also read: priyanka MOhan: హీరో లేడు కానీ హిట్ కొట్టింది బాసు.. మరి ఓజి ఇచ్చిన ఎనర్జి అలాంటిది

మన సినిమా విషయానికివస్తే దర్శక, నిర్మాతలు కొత్తకథలని ఎన్నుకోవాలి. ప్రాంతీయ చిత్రాల సరిహద్దులని చెరిపేస్తూ, పప్రంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను తీయాలి. నటీనటులు కూడా నటనలో కొత్త మెళుకువలు నేర్చుకుంటూ, వైవిధ్యమైన క్యారెక్టర్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి సినిమాని  ఒక సవాలుగా  స్వీకరించి ప్రేక్షకులకి  సరికొత్త అనుభూతిని కలిగించేలా కృషిచేయాలి. ముందు ముందు ధురంధర్2  మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమా బాలీవుడ్ చిత్రపరిశమ్రకు ఒక కొత్త దిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు. అయితే, ఈ విజయం కేవలం ఒక సినిమాకే పరిమితం కాకుండా, బాలీవుడ్ చిత్రాల పరంపరను పెంచే అవకాశం ఉంది.మరి  ఈ విజయం టాలీవుడ్ పరిశమ్రలో ఎలాంటి మార్పులకి  నాంది పలుకుతుందో వేచి చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com