Home

»

Latest News

ధృవ సెకండాఫ్ ద‌బిడి దిబిడే

Dec 7, 2016 11:25AM


రామ్ చ‌ర‌ణ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న సినిమా... ధృవ‌. వ‌రుస ఫ్లాపుల‌కు బ్రేక్ ప‌డాలంటే... ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే. అందుకే చ‌ర‌ణ్ సేఫ్ గేమ్ ఆడాల‌ని చూశాడు. ఆల్రెడీ ఓ చోట హిట్ అయిన క‌థ ని ఎంచుకొని, దానికి స‌మ‌ర్థులైన టెక్నీషీయ‌న్ల‌ను తీసుకొని... డిసెంబ‌రులో పెద్ద సినిమాల హ‌డావుడి లేకుండా విడుద‌ల చేస్తున్నాడు. త‌న ప్లానింగ్ అంతా ప‌క్కాగా కుదిరినా... సినిమా ఫ‌లితం కాస్త అటూ ఇటూ అయ్యే ఛాన్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని సినీ విశ్లేష‌కులు ముందే ఓ అంచ‌నాకు వ‌స్తున్నారు.

త‌ని ఒరువ‌న్‌లో ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే సురేంద‌ర్ రెడ్డి తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని, మార్పులు, చేర్పుల జోలికి అస్స‌లు వెళ్ల‌కుండా చ‌ర‌ణ్ సంకెళ్లు వేసేశాడ‌ని తెలుస్తోంది. త‌ని ఒరువ‌న్‌కీ ధృవ‌కీ 1 శాతం కూడా తేడాలేదంటే.. ఈసినిమా ఎంత క‌ట్‌, కాపీ, పేస్టో అర్థం చేసుకోవొచ్చు. ఆఖ‌రికి త‌ని ఒరువ‌న్ ర‌న్ టైమ్‌, ధృవ ర‌న్ టైమ్ ఇంచుమించు ఒకేలా ఉంద‌ట‌. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తీయ‌డానికి కూడా సురేంద‌ర్ రెడ్డి త‌డ‌బ‌డ్డాడ‌ని స‌మాచారం. ఫ‌స్టాఫ్ బాగున్నా..  సెకండాఫ్ తేడా కొట్టింద‌ని... ఆ ఎఫెక్ట్ మొత్తం సినిమాపై ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

అయితే చ‌ర‌ణ్ ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. త‌న లుక్‌, డైలాగ్ డెలివ‌రీ ఈ సినిమాలో కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని చెబుతున్నారు. దానికి తోడు ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల ఆర‌బోత మాస్ కి న‌చ్చితే.. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మినిమం ఏవ‌రేజ్ స్థాయిని అందుకోగ‌ల‌ద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం, ధృవ పాజిటీవ్ బ‌జ్ ఇవ‌న్నీ మంచి వ‌సూళ్లు తీసుకురావ‌డానికి దోహ‌దం చేసే విష‌యాలే. కానీ.. దాన్ని ధృవ ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకొంటాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com