Home

»

Latest News

ఐష్ సూసైడ్ అటెంప్ట్ వెనుక..?

Dec 7, 2016 11:01AM

సినీ పరిశ్రమకు రూమర్లకు అవినాభావ సంబంధం ఉంది. అందులోనూ లీడింగ్ హీరో, హీరోయిన్లపై వచ్చే పుకార్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్. అందుకే పుకారు రాయుళ్లు వీళ్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. తాజాగా బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్‌ సూసైడ్ చేసుకుందంటూ రూమర్ అల్లేశారు.  

కుటుంబసభ్యుల మధ్య చోటు చేసుకున్న కలహాలే ఆమె సూసైడ్‌కి కారణమని..ఏ దిల్ హై ముష్కిల్ సినిమా నుంచి కుటుంబంలో కలతలు ఎక్కువయ్యాయని..ఐష్ స్కిన్ షో చేయడం..వారికి అస్సలు ఇష్టంలేదని..ఈ విషయంపై అత్తా-కోడళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని..ఈ కారణం చేతనే ఐష్ సూసైడ్‌కు యత్నించిందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దానికి ఆధారంగా స్ట్రెచర్ మీద ఐశ్వర్య పడుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు పుకారు రాయుళ్లు. ఈ గాసిప్ వైరల్ అవుతున్న సమయంలోనే డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి ఐష్ ఓ పార్టీలో పాల్గొన్న ఫోటోలు బయటకు రావడంతో ఐష్ సూసైడ్ న్యూస్ ఫేక్ అని తేలిపోయింది. దీంతో ఐశ్వర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com