Home

»

Latest News

ఢీ రాజు సంచలన ఆడియో లీక్: మనసు మార్చుకుంటే 50 లక్షలు.!

Sep 15, 2026 2:35PM

ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ-10' విన్నర్ రాజు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాల పేరుతో దగ్గరై, మోసం చేశాడంటూ ఒక యువతి ఫిర్యాదుతో రాజుపై కేసు నమోదైంది. అయితే శిరీష అనే యువతితో రాజు మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయ్యి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇక మీదట మనం ఫ్రెండ్స్ లా ఉందాం" అని ఆ ఆడియోలో రాజు చెప్పినట్టుగా ఉంది. అయితే శిరీష మాత్రం.. "రాజు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ, నువ్వు వేరే అమ్మాయికి దగ్గరవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను." అని ఎంతో ఎమోషనల్ గా చెప్పింది. అంతేకాదు, "నా డబ్బులు నేను తిరిగి తీసుకున్నాక.. నీపై నాకు హక్కు ఉండదు. ఇంత జరిగిన తర్వాత ఫ్రెండ్ లా ఉండలేను. ఒకవేళ నువ్వు తప్పు తెలుసుకొని, మనసు మార్చుకొని వస్తానంటే.. ఆ డబ్బులు రిటర్న్ అడగను. ఇంకా 50 లక్షలు లోన్ తీసుకొని నీ చేతిలో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను." అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఆ ఆడియో క్లిప్ ను బట్టి అర్థమవుతుంది ఏంటంటే.. రాజుని శిరీష మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతనికి లక్షల్లో డబ్బులు కూడా ఇచ్చింది. కానీ, రాజు వేరే అమ్మాయితో చనువుగా ఉండటం శిరీషకు నచ్చలేదు. అందుకే డబ్బులు రిటర్న్ అడిగింది. ఒకవైపు డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతూనే.. మరోవైపు రాజు మనసు మార్చుకొని తనతో ఉంటానంటే ఇంకా డబ్బులు ఇస్తానని కూడా చెబుతుంది. మరి ఈ ఆడియోలో నిజానిజాలు ఎంత? ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగి రాజు జైలు పాలయ్యాడు? అనేది తెలియాల్సి ఉంది.

 

 

 

[Dhee Raju Audio Leak, Dhee Raju Case, Raju Sirisha Audio, Dhee Raju Audio, Dhee Raju, Telugu Film News, Telugu Audio, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com