Home

»

Latest News

kanguva: కంగువ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. వైరల్ గా మారిన అగ్ర హీరో 

Jun 1, 2026 12:22PM


సూర్య(Suriya)తో పాటు అభిమానులకి లైఫ్ లాంగ్ గుర్తుండే మూవీ కంగువ..అంతలా భారీ అంచనాలతో వచ్చి భారీ డిజాస్టర్ ని అందుకుంది. అందుకే అభిమానులు  కంగువని మరిచిపోవడం కష్టం. ఈ చిత్రానికి దర్శకుడు శివ.. థలా అజిత్ తో  వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన  శివ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా నిరూపించుకున్నారు.తెలుగులో గోపిచంద్, రవితేజతో సినిమాలు చేసిన శివ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన  లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటివరకు కెరీర్‌లో వైవిధ్యమైన, ప్రయోగాత్మక కథాంశాలకి  ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ధనుష్(Dhanush), ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి  శివ  అద్భుతమైన స్క్రిప్ట్‌ని ధనుష్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ గురించిన వార్త బయటకు రాగానే అటు ధనుష్ అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించే అవకాశం ఉంది. గతంలో ధనుష్ హీరోగా నటించిన 'క్యాప్టెన్ మిల్లర్' వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సంస్థ, ఈసారి శివ,ధనుష్ కలయికలో రాబోయే ప్రాజెక్ట్‌ని అంతకు మించిన భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తోందట. 100 శాతానికి పైగా మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక విభిన్నమైన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని టాక్. 


Also read: VIjay: నటి జూలియా సంచలన వ్యాఖ్యలు.. నా గర్భస్రావానికి విజయ్ కారణం

సాధారణంగా ధనుష్ సినిమాలు అంటేనే నటనకి  ప్రాధాన్యమున్న పాత్రలు, సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు గుర్తుకువస్తాయి. అయితే, ఒక కమర్షియల్ మాస్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలో ధనుష్ నటిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎలా ఉంటుందో ఊహించుకోవడమే అభిమానులకు పూలపండగలా ఉంది. శిరుతై శివ సినిమాల్లో ఉండే సెంటిమెంట్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ధనుష్ బాడీ లాంగ్వేజ్‌కి ఖచ్చితంగా సరిపోతాయని  విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సంవత్సరమే సెట్స్ పైకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com