Home

»

Latest News

25 ఏళ్లుగా సంగీతంతో మైమరిపిస్తున్నాడు.. ఇప్పుడు నటుడిగా మ్యాజిక్ చేయబోతున్నాడు.!

Nov 22, 2026 3:50PM

ప్రముఖ సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ త్వరలో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో డీఎస్పీ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన ఆయన.. ఇప్పుడు నటుడిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారనే ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు వేణు ఎల్దండి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 25 ఏళ్లుగా దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్నారని, ఇప్పుడు నటుడిగా కూడా తన మ్యాజిక్ చూపించబోతున్నారని అన్నారు. డీఎస్పీని తెరపై కొత్త అవతారంలో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక ‘ఎల్లమ్మ’ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో జానపద కళలు, సంప్రదాయాలు, గ్రామీణ ప్రజల జీవితాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉండనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అందిస్తున్నారు.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్నారు. భాషా సరిహద్దులు దాటి ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. మరి సంగీతంతో ఇన్నాళ్లూ ప్రేక్షకులను అలరించిన డీఎస్పీ.. నటుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

 

 

[DeviSriPrasad, DSPActingDebut, YellammaMovie, VenuYeldandi, TeluguCinemaNews]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com