Home

»

Latest News

మహేష్ సినిమాలో విలన్‌గా అనుపమ.. ఆ ఒక్క భయమే ఉందంటూ కామెంట్స్‌.!

Nov 22, 2026 3:26PM

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మహేష్ బాబుపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. మహేష్ బాబును ఒక్క మాటలో వర్ణించమని యాంకర్ అడగ్గా.. ఆయన చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారని, తనకు మహేష్ అంటే క్రష్ అని చెప్పుకొచ్చారు.

అంతేకాదు, మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని అనుపమ తెలిపారు. చివరకు విలన్ పాత్ర వచ్చినా వదులుకోనని ఆసక్తికరంగా చెప్పారు. అయితే అలాంటి పాత్రలో నటించేటప్పుడు తనకు ఓ సమస్య ఎదురవుతుందని సరదాగా వెల్లడించారు.

సినిమాలో విలన్‌గా నటిస్తూ మహేష్ బాబును కోపంగా చూడాల్సిన సన్నివేశాలు ఉంటే.. తాను మాత్రం ఆయన్ని రొమాంటిక్‌గా చూస్తానేమోనని నవ్వుతూ చెప్పారు. అంతేకాదు, మహేష్ బాబు ఎదురుగా నిలబడితే డైలాగులు కూడా మర్చిపోయే అవకాశం ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక అనుపమ ఇటీవల ‘క్రేజీ కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అనుపమ.. మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వస్తే నిజంగానే విలన్‌గా కనిపిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

[AnupamaParameswaran, MaheshBabu, AnupamaComments, AnupamaCrush, AnupamaVillain]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com