ENGLISH | TELUGU  

దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్

on Mar 9, 2011

devi prasad venkatesh, devi prasad venkatesh movie, blade babji director, devi prasad blade babji venkatesh bellamkondaదేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక చిత్రంలో నటించబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తన శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, "ఆడుతూ పాడుతూ", "బ్లేడ్ బాబ్జి" వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు దేవీ ప్రసాద్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుపడ్డ దేవీ ప్రసాద్ తొలిసారిగా విక్టరీ వెంకటేష్ వంటి ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారు.  దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈ చిత్రం హీరో విక్టరీ వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుందట. అలాగే దర్శకుడు దేవీ ప్రసాద్ స్టైల్లో పూర్తి హాస్యరస భరితంగా ఉంటుందని సినీ వర్గాలంటున్నాయి.

 

ఈ చిత్రం కథ గురించి ఇంకా ఏ విషయం తెలియక పోయినా, దేవీ ప్రసాద్ చెప్పిన కథ హీరో వెంకటేష్ కి బాగా నచ్చిందని తెలిసింది. గతంలో ఇదే బ్యానర్ లో వెంకటేష్ నటించిన "నాగవల్లి" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కనుక దేవీ ప్రసాద్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించే ఈ చిత్రం డెఫినెట్ హిట్టవుతుందని సినీ పండితుల అంచనా.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.