Home

»

Latest News

రాజమండ్రిలో రాజబాబు విగ్రహం

Mar 09, 2011

comedian raja babu, Raja Babu statue, Raja Babu rajahmundry, Raja Babu statue rajahmundry, murali mohan raja babu, murali mohan rajahmundryఅలనాటి మేటి హాస్యనటుడు, మనసున్న మనిషి రాజబాబు చనిపోయి ఏప్రెల్ 9 వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజబాబు జన్మించిన రాజమండ్రి నగరంలో, రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించాలని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు మురళీ మోహన్ తీర్మానించారు. అందుకు అవసరమైన ధనాన్ని కూడా మురళీ మోహన్ తానే స్వయంగా సమకూరుస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు 75 మంది సినీహాస్య నటీనటులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న రాజబాబు కుమారులు భారతదేశానికి రానున్నారు. రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ప్రతిష్టించటం చాలా ముదావహమని సినీ పరిశ్రమ "మా" అసోసియేషన్ ని ప్రశంసిస్తోంది.

 

ఈ కార్యక్రమం జరగటం తమకు చాలా ఆనందంగా ఉందని రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్, బాబి తమ ఆనందాన్ని తెలియజేశారు. ఏప్రెల్ 9 వ తేదీన, ఆలస్యంగానైనా రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో రాజబాబు విగ్రహప్రతిష్ట జరపటం సినీపరిశ్రమ ఆయనకు ఇచ్చే ఘననివాళిగా భావించవచ్చు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com