Home

»

Latest News

VIjay Deverakonda: విజయ్ దేవరకొండకి నా తర్వాతనే  రష్మిక.. వైరల్ అవుతున్న ప్రముఖ నటి కామెంట్స్ 

Apr 20, 2026 12:27PM

 

-లిప్ లాక్ సీన్ లో నేనే బాగా చేస్తా 
-నాగార్జున గారు అంటే క్రష్
-నేను చెప్పేది అన్ని నిజాలు 
-ప్రముఖ నటి ఇంటర్వ్యూ వైరల్
 

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda),రష్మిక(Rashmika Mandanna)హ్యాపీగా పెళ్లి చేసుకొని తమ కొత్త కాపురాన్ని ఎన్నో ఆశలతో స్టార్ట్ చేసారు. స్టార్ చెయ్యడమే కాదు, ఈ భూమ్మీద తమని మించిన అదృష్ట జంట లేదనే విధంగా మురిసిపోతూనే ఉంటారు. ఎందుకంటే ప్రేమంట అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అభిమానులు కూడా ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే తమ కల నెరవేరడంతో జోష్ లో ఉన్నారు. ఇప్పుడు అభిమానులతో పాటు విజయ్, రష్మిక నోరెళ్లబెట్టే న్యూస్ ఒకటి సోషల్ మీడియాని నయా ట్రెండ్ హోదాలో రౌండప్ చేసింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం   


దీపిక రంగరాజు.. అసలు పేరు కంటే బ్రహ్మముడి సీరియల్‌ ద్వారా కావ్యగా గుర్తింపు సంపాదించింది. రీసెంట్ గా వర్ష నిర్వహిస్తున్న 'కిస్సిక్ టాక్ షో' కి గెస్ట్‌గా వెళ్ళింది. అందులో ఆమె మాట్లాడుతు నాగార్జున గారంటే  చాలా ఇష్టం. మన ఏజ్ వాళ్లలో విజయ్ దేవరకొండగారు అంటే క్రష్. కానీ నాకు సేమ్ క్రష్ నాగార్జున గారిని చూసినప్పుడల్లా వస్తుంది. ఒకరోజు ఆయనని డైరెక్ట్‌గా చూశా, ఆ రోజు నేను మాట్లాడింది అంతా నిజం. స్క్రిప్ట్ కాదని చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కావ్యతో వర్ష 'విజయ్ దేవరకొండగారితో కిస్ సీన్ చేయాలంటే చేస్తావా అని అడిగింది. అప్పుడు కావ్య మాట్లాడుతు  రష్మిక గారేంటీ, నేనెంత బాగా చేస్తానో తెలుసా అని బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

also read: sonali raut: బిగ్ బాస్ వల్ల నాకు ఆ రోగం వచ్చింది.. డబ్బు డిమాండ్ చేస్తున్న కంటెస్ట్

ఇదే షో లో కావ్య మాట్లాడుతు  ఆన్‌స్క్రీన్ పై రొమాంటిక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో అయినా చేస్తాను. వాళ్లు సిగ్గుపడతారేమో కానీ నాకు సిగ్గు, మొహమాటం ఏం లేవు. ఆర్టిస్ట్ అనే వాళ్లు నో చెప్పకూడదు, కెమెరా ముందు ఎలాంటి సీన్ చేయడానికైనా రెడీగా ఉండాలని చాలా డేర్ గా సమాధానాలు చెప్పింది. కావ్యది తమిళనాడు లోని పనృతి.. 2021 లో వచ్చిన చితురం పేసుతడి అనే తమిళ సీరియల్ ద్వారా నటనావృత్తిలోకి అడుగుపెట్టింది. 

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com