Home

»

Latest News

90 ఏళ్ల బామ్మ‌తో అప్పారావు పెళ్లి.. బ్ర‌హ్మానందం, రాజేంద్రప్ర‌సాద్ కామెడీ అదుర్స్‌!

Apr 20, 2026

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శోభ‌న‌, బ్రహ్మానందంతోపాటు టాలీవుడ్‌లోని అనేక మంది క‌మెడియ‌న్స్ క‌లిసి న‌టించిన ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ అప్పుల అప్పారావు. ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా విడుద‌లై దాదాపు 35 సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌టికీ ఈ  సినిమాలోని కామెడీ సీన్స్‌కి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ సినిమాలో ప్రేక్ష‌కులను క‌డుపుబ్బ న‌వ్వించిన ఓ స‌న్నివేశం ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అప్పుల బాధ త‌ప్పించుకొని కోటీశ్వ‌రుడు అవ్వాలంటే చ‌నిపోవ‌డానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని రాజేంద్ర‌ప‌సాద్‌కి స‌ల‌హా ఇస్తాడు బ్రహ్మానందం. ఆ క్ర‌మంలోనే ఒక ముసలావిడని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ పెళ్లి కూతురు వయస్సు దాదాపు 90 ఏళ్లు. ఆమెకు చెవుడు కూడా ఉంటుంది. మంగళసూత్రం కట్టేలోపే ఆమె చనిపోవడంతో అప్పారావు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బ్రహ్మానందం పౌరోహిత్యం, రాజేంద్ర ప్రసాద్ టైమింగ్ ఈ సీన్‌ని ఎవర్ గ్రీన్ కామెడీగా మార్చాయి.

ఏంట్రా బాబూ ఈ వింత పెళ్లి? అని షాక్ అవ్వకండి. మన 'అప్పుల అప్పారావు' గాడి కష్టాలు అన్నీ ఇన్నీ కావు కదా! అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఒక బామ్మనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు మన రాజేంద్ర ప్రసాద్. అసలు ఈ సీన్ మళ్ళీ చూస్తుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాదు.

సీన్ లోకి వెళ్తే.. పెళ్లి కూతురుని తీసుకురమ్మంటే ఒక ముసలావిడని తీసుకొస్తారు. ఆమె వయస్సు ఎంతో తెలుసా? అక్షరాలా తొంభై ఏళ్ళు పైనే! 19 ఏళ్ళ వయసులో కోమాలోకి వెళ్లి, మళ్ళీ 91 ఏళ్ళ వయసులో స్పృహలోకి వచ్చిన 'స్వచ్ఛమైన కన్య' అట ఆమె. ఈ డైలాగ్ వినగానే బ్రహ్మానందం ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్ హైలైట్.

ఇక పెళ్లి కొడుకును చూసి ఆ బామ్మ సిగ్గుపడటం మరో లెవల్. "సిగ్గా.. నీ సిగ్గు పిల్లి మొగ్గలేయ" అంటూ బ్రహ్మానందం వేసే సెటైర్లు మామూలుగా లేవు. అసలే ఆమెకు చెవుడు, బ్రహ్మానందం అర‌చి అర‌చి ఆమెతో మాట్లాడ‌డం అప్పట్లో కామెడీ అంటే ఇదీ అనిపిస్తుంది. మన అప్పారావు మాత్రం ఏమనుకుంటాడంటే.. ఎలాగో ఇవాళో రేపో పోయే మనిషే కదా, తాళి కట్టేస్తే ఆస్తి వస్తుంది అని ప్లాన్ వేస్తాడు.

కానీ ట్విస్ట్ ఏంటంటే.. ముహూర్తం దగ్గర పడుతుంటే ఆ బామ్మ "నేను పోతున్నా.. నేను పోతున్నా" అంటూ ప్రాణాలు వదిలేస్తుంది. అంటే సుమంగళిగా చనిపోవాలనే తన కోరిక తీరకుండానే సీన్ ముగుస్తుంది. చివర్లో ఐరన్ లెగ్ తమ్ముడు ఎంట్రీ ఇచ్చి, ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వచ్చానని చెప్పడం కొసమెరుపు.

ఈ వీడియో కింద నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "రాజేంద్ర ప్రసాద్ - బ్రహ్మానందం కాంబినేషన్ అంటేనే పూనకాలు", "ఇలాంటి కామెడీ ఇప్పుడు రావడం లేదు" అంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ఫన్నీ సీన్ చూసి ఒకసారి గట్టిగా నవ్వేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com