
డెకాయిట్(Dacoit) విషయంలో ఇప్పుడు నమోదైన రికార్డుని ఎవరు ఊహించలేదు. అసలు కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు. మేకర్స్ కూడా అందుకు అతీతులేం కాదు. బహుశా అందుకే అది రికార్డు అయ్యింది. మరి లేటు చేయకుండా ఆ రికార్డు విశేషాలేంటో చూద్దాం.
డెకాయిట్ మే 8 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అంటే నిన్న. కానీ గత రికార్డులపై ఏ మాత్రం జాలి, దయ అనేది చూపించకుండా కేవలం 24 గంటల్లోనే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఎగబడి చూస్తున్నారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదటిది అడివి శేష్ బ్రాండ్ ఇమేజ్: క్షణం నుండి మేజర్ వరకు శేష్ సినిమాలకి ప్రత్యేకమైన క్లాస్ ఆడియన్స్ ఉన్నారు. డెకాయిట్ లో ఆయన మాస్ అండ్ రఫ్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.
రెండవది మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్: మృణాల్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఒక టీనేజ్ కూతురికి తల్లిగా ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించింది. దీంతో ఆమె పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కుతున్నాయి.
మూడవది అనురాగ్ కశ్యప్ ఎంట్రీ: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ డెకాయిట్ తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ స్పెక్టర్ స్వామి పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు
Also read: Irumudi: ఫుల్ స్వింగ్ లో ఇరుముడి.. అంతా అందులోనే ఉంది మహత్యం
ఓటీటీలో డెకాయిట్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన డెకాయిట్ కి ఎక్కువ శాతం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టడం గమనార్హం.






