
సినిమా.. దేవుడు అన్నిచోట్ల ఉండలేక సినిమాని సృష్టించాడు అనే మాటని సినీ ప్రియులు నమ్ముతూ ఉంటారు. నిజజీవితంలో మనం చేయలేని ఎన్నో సాహసాలని, వినోదాన్ని కలగలపుకొని సినిమా అనేది మనకి ఎన్నో ఆనందాల్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో దొరికే అత్యంత చవకైన వినోదం కూడా సినిమానే అని సినీ మేకర్స్ తరచూ చెప్తూ ఉంటారు.
అలాంటి సినిమాని క్రికెట్ దెబ్బకొడుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. సినీ ప్రియులు స్పందిస్తు గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా వస్తున్న ఐపీఎల్ సీజన్లు, ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లు సినిమా ఇండస్ట్రీ కలెక్షన్లను కోట్లలో దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా 45 నుండి 60 రోజుల పాటు సాగే ఐపీఎల్ సీజన్ సమయంలో థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య దాదాపు 30% నుండి 40% వరకు పడిపోతోంది. ప్రతిరోజూ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో, సెకండ్ షోలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీని ప్రభావం కేవలం చిన్న సినిమాలపైనే కాదు, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే భారీ చిత్రాలపై కూడా పడుతోంది. ఐపీఎల్ ఫైనల్స్ లేదా భారత్, పాకిస్తాన్ వంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటు కేవలం 15% కి పడిపోవడం సినిమాని కలవరపెడుతోంది. డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో మ్యాచ్‌లని ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండటంతో, ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చుని మ్యాచ్‌లు చూడటానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మల్టీప్లెక్స్ చైన్స్ పీవీఆర్-ఐనాక్స్ వంటి సంస్థలు కూడా తమ వీకెండ్ బిజినెస్‌లో దాదాపు 25% నష్టాన్ని చవిచూస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకోవాల్సి వస్తోంది. ఏప్రిల్, మే వంటి మేజర్ సమ్మర్ సీజన్లలో గతంలో భారీ సినిమాలు సందడి చేసేవి, కానీ ఇప్పుడు క్రికెట్ భయంతో జూన్ లేదా జూలై నెలలకు వాయిదా వేసుకుంటున్నారు. ఆ విధంగా వాయిదా వేసుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటూనే ఉంది. ప్రెజెంట్ వస్తున్న ఇంగ్లాండ్ సిరీస్ నే ఉదాహరణ. కేవలం థియేటర్ల రన్ మాత్రమే కాదు, శాటిలైట్ ఛానల్స్ టీఆర్పీ (TRP) రేటింగులు కూడా క్రికెట్ మ్యాచ్‌ల వల్ల 50% పైగా పడిపోతున్నాయి. అటు క్రికెట్ బోర్డులు నిరంతరాయంగా సిరీస్‌లు, లీగ్‌లు నిర్వహిస్తుండటంతో సినిమా రంగానికి కోలుకునే సమయం దొరకడం లేదు.
Also read: జననాయగన్ ఫస్ట్ రివ్యూ!
చివరకి థియేటర్ల యజమానులు సైతం మనుగడ కోసం సరికొత్త దారులు వెతుకుతున్నారు. మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో థియేటర్ స్క్రీన్లపైనే లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రదర్శిస్తూ టికెట్లు అమ్ముకుంటున్నారు. అయినప్పటికీ, ఒక సినిమా సాధించాల్సిన పూర్తి స్థాయి వసూళ్లను క్రికెట్ మ్యాచ్‌లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయనేది నగ్న సత్యం. దాదాపు 500 కోట్ల నుండి 1000 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ ఈ క్రికెట్ ఫీవర్ వల్ల ప్రతి సంవత్సరం నష్టపోతోందని అంచనా. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో, ప్రేక్షకులను థియేటర్లకి ఎలా రప్పిస్తుందో చూడాలి.
cinema, cricket, tollywood





