Home

»

Latest News

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్: బాలయ్య ఫ్యాన్‌గా రాధిక.. శ్రీవిష్ణు మామూలు కామెడీ కాదు.!

Oct 6, 2026 4:23PM

శ్రీవిష్ణు సినిమాలు అంటేనే కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్.. దానికి తగ్గట్టుగా కామెడీ. ఇప్పుడు ఆయన నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా అలాంటి మరో సినిమాలానే కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ, రొమాన్స్, యాక్షన్‌ను ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో కలిపి సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.

జానకిరామ్ మారెల్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. మొదట్లో ఒక సాధారణ యువకుడిగా కనిపించే కళ్యాణ్ జీవితం.. అనుకోని పరిస్థితుల్లో పూర్తిగా మారిపోతుంది. చివరకు పోలీసులు వెతికే మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా ఎలా మారాడు? అనేదే సినిమా అసలు కథలా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో ముందుగా కళ్యాణ్ పర్సనల్ లైఫ్‌ను పరిచయం చేశారు. ఒడిశాకు చెందిన అమ్మాయి పాత్రలో మహిమా నంబియార్ కనిపిస్తున్నారు. కళ్యాణ్, ఆ అమ్మాయి మధ్య లవ్ ట్రాక్ కూడా ఫన్‌గా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక కళ్యాణ్ తల్లి పాత్రలో రాధికా శరత్‌కుమార్ కనిపించారు. ఆమె పాత్రకు కూడా మంచి ఫన్ యాంగిల్ పెట్టారు. ముఖ్యంగా ఆమె బాలకృష్ణకు వీరాభిమానిగా, కాస్త కోపిష్టి తల్లిగా కనిపించడం ట్రైలర్‌లో హైలైట్‌గా అనిపిస్తోంది.

అయితే సినిమా అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ (షైన్ టామ్ చాకో) కళ్యాణ్ కోసం వేట మొదలుపెడతాడు. అసలు కళ్యాణ్ నక్సలైట్‌గా ఎందుకు మారాడు? అతను చేసిన నేరం ఏంటి? పోలీసులు అతని కోసం ఎందుకు ఇంత సీరియస్‌గా వెతుకుతున్నారు? అనే ప్రశ్నలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా ఎస్టాబ్లిష్ చేశారు.

సీరియస్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ.. సినిమా మొత్తం మాత్రం సీరియస్‌గా ఉండదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీతో మరోసారి ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పే వన్‌లైనర్స్, డైలాగ్ డెలివరీ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

శ్రీవిష్ణుకు తోడుగా సత్య, వెన్నెల కిశోర్ కామెడీని మరింత పెంచేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సీరియస్ సిట్యుయేషన్స్‌లో కూడా శ్రీవిష్ణు తనదైన టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు.

మొత్తానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ ఎంటర్టైనింగ్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తోంది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ అనగానే ఒక సీరియస్ పొలిటికల్ లేదా యాక్షన్ డ్రామాను ఊహిస్తాం. కానీ శ్రీవిష్ణు తన మార్క్ కామెడీని జోడించి దాన్ని పూర్తిగా డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే పబ్లిసిటీ విషయంలో కాస్త వెనుకబడిన ఈ సినిమాకు ట్రైలర్ మాత్రం కొంత బజ్ తీసుకొచ్చేలా ఉంది. సినిమా కూడా ఇదే ఫన్, ఫ్రెష్‌నెస్‌ను కంటిన్యూ చేస్తే శ్రీవిష్ణుకు మరో మంచి ఎంటర్టైనర్ దొరికినట్టే. అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకోనుందో చూడాలి.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ విధ్వంసం.. గూస్ బంప్స్ తెప్పించే భారీ యాక్షన్ సీక్వెన్స్.!

 

 

 

[Comrade Kalyan Trailer, Comrade Kalyan Movie, Sree Vishnu, Mahima Nambiar, Janakiram Marella, Comrade Kalyan, Satya Comedy, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com