Home

»

Latest News

రామ్ చరణ్ మంచి మనసు

Jul 7, 2022 3:25PM

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకొని మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆన్ స్క్రీన్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే చరణ్.. ఆఫ్ స్క్రీన్ లో తన మంచి మనసుతో ఎందరో హృదయాలు గెలుచుకుంటూ ఉంటాడు.

గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే, ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సినీ నటుడు కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో చరణ్ ని అడిగి 2లక్షలు తీసుకుని 'మనం సైతం' ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసారు.

తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు మెగా వారసుడు. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో #RC15(వర్కింగ్ టైటిల్) సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా అమృత్ సర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ కి సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యి హైదరాబాద్ కి తిరిగి రావాల్సి ఉంది. #RC15 లో కమెడియన్ సత్య కూడా నటిస్తున్నాడు. సత్య సన్నివేశాలు కూడా పూర్తయ్యి హైదరాబాద్ కి రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న చరణ్, సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్ కి తీసుకుని వచ్చారు. పెద్ద స్టార్ అయ్యుండి ఎలాంటి ఇగో లేకుండా, తనను ఆయన సొంతం విమానంలో తీసుకురావడంతో సత్య సంబర పడిపోయాడట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com