Home

»

Latest News

క‌మ‌ల్, గౌత‌మి బ్రేక‌ప్‌.. నోరు విప్పిన శ్రుతిహాస‌న్‌

Nov 2, 2016 1:02PM

క‌మ‌ల్ హాస‌న్‌ నుంచి విడిపోతున్నా... అంటూ గౌత‌మి బాంబు పేల్చేసింది. దాంతో ఈ వ్య‌వ‌హారం చుట్టూ ఎన్నో క‌థ‌లు అల్లుకొంటున్నారు గాసిప్ రాయుళ్లు. శ్రుతిహాస‌న్ వ‌ల్లే.. ఈ జంట విడిపోయార‌ని, శ్రుతితో గౌత‌మి విబేధాలే ఈ బ్రేక‌ప్‌కి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఈ విష‌య‌మై క‌మ‌ల్ హాస‌న్ ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు. కానీ.. శ్రుతిహాస‌న్ మాత్రం నోరు విప్పింది. మ‌రొక‌రి వ్య‌క్తిగ‌త జీవితం, వ్య‌క్తి గ‌త నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, త‌న‌కు తన కుటుంబం, త‌ల్లింద్రులు, చెల్లాయి త‌ప్ప ఎవ‌రేమైపోయినా లెక్క‌లేద‌ని తేల్చి చెప్పింది. శ్రుతి హాస‌న్ స్టేట్‌మెంట్ మొక్కుబ‌డి తంతులానే ఉంది త‌ప్ప‌.. జ‌రిగిన బ్రేక‌ప్‌కి అస‌లైన కార‌ణాన్ని బ‌య‌ట‌పెట్టేదిగా లేదు. గౌత‌మిని ఇప్పుడే ప‌రాయి వ్యక్తిగా చూడ‌డం కూడా గౌత‌మి సానుభూతి ప‌రుల‌కు, స‌న్నిహితుల‌కు మింగుడు ప‌డ‌ని విష‌య‌మే. క‌నీసం క‌మ‌ల్‌హాస‌న్ అయినా ముందుకొచ్చి... బ్రేక‌ప్ విష‌య‌మై స్పందిస్తే కొన్ని పుకార్ల‌కైనా పుల్ స్టాప్ ప‌డుతుంది. మ‌రి.. క‌మ‌ల్ ఎప్పుడు స్పందిస్తాడో ఏంటో??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com