Home

»

Latest News

శేఖర్ మాస్టర్‌కు యాక్సిడెంట్: 'కాకా' షూటింగ్ నుంచి వస్తుండగా కారుని ఢీ కొట్టిన ట్రక్.!

Nov 12, 2026 10:27AM

టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శంషాబాద్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ శేఖర్‌ మాస్టర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. పండ్ల లోడ్‌తో వేగంగా వెళ్తున్న ట్రక్, శేఖర్‌ మాస్టర్‌ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆయన కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది.

అయితే ప్రమాద సమయంలో కారులో ఉన్న శేఖర్‌ మాస్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను చూస్తే పెను ప్రమాదమే తప్పినట్లు కనిపిస్తోంది. సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

 

 

 

[Sekhar Master Accident, Shamshabad Accident, Hyderabad, Chiranjeevi, Kaaka Movie]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com