
'చిరంజీవి' అనే పేరుకి ఉన్న వైబ్రేషన్స్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండటం అసాధ్యం. దాని తాలూకు ప్రకంపనలు ఎప్పటికప్పుడు నిత్య యవ్వనంతో ప్రకాశిస్తూనే ఉంటాయి. ఆ చిరంజీవి అనే కాంతి పుట్టి ఇప్పటికి 48 ఇయర్స్. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన పోస్ట్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కర్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. ఆ వివరాలు చూద్దాం.
. 1978 సెప్టెంబర్ 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఒక సాధారణ యువకుడు 'చిరంజీవి'గా తన సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అంటే ఈ రోజే. నేటితో ఆ చారిత్రాత్మక ఘట్టానికి సరిగ్గా 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక అత్యంత భావోద్వేగభరితమైన లేఖని పంచుకున్నారు. 1978 సెప్టెంబర్ 22న తాను నటించిన మొదటి చిత్రం 'ప్రాణం ఖరీదు' బాక్సాఫీస్ వద్ద విడుదలై, వెండితెరకు నటుడిగా పరిచయమయ్యానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. "ఆనాడు నేను పెట్టుకున్న 'చిరంజీవి' అనేది ఒక పేరు మాత్రమే, కానీ ఈ 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీరందరూ కురిపించిన అపారమైన ప్రేమతో అది నాకింటి పేరుగా, శాశ్వతమైన గుర్తింపుగా మారింది" అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ 48 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించానని, లెక్కలేని విజయాలను, ఎన్నో మైలురాళ్లను, ప్రతిష్టాత్మక పురస్కారాలు మరియు గౌరవాలను అందుకున్నానని తెలిపారు.
ఇది కుడా చదవండి: రాధకి ట్విస్ట్ ఇచ్చిన సోదరి అంబిక: ఆ 46 కోట్లు ఇవే!
.webp)
150కి పైగా చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చిరంజీవి, తన విజయాలన్నింటికంటే అభిమానులు తన గుండెల్లో ఇచ్చిన స్థానమే అత్యంత విలువైనదని కొనియాడారు. తనలోని నటుడిని నమ్మి అవకాశాలిచ్చిన ప్రతిష్టాత్మక నిర్మాతలు, వైవిధ్యమైన పాత్రల్లో తనను ఆవిష్కరించిన దర్శకులు, సహ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ను మెగాస్టార్ చిరంజీవిగా గుండెల్లో పెట్టుకుని, సొంత కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మెగా పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ 48 ఏళ్ల మెగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.





