
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ‘కాకా’ డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. దేవుని దగ్గర స్క్రిప్ట్ ఉంచి, పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సినిమాలో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఆమె అమ్ములు పాప అనే పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘కాకా’ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో రిలీజ్ డేట్‌ను టార్గెట్‌గా పెట్టుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసే పనిలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి ‘కాకా’లో చిరంజీవిని బాబీ ఏ రేంజ్‌లో చూపించబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘రంగం’ వెనుక కథ.. ముగ్గురు స్టార్స్ వదులుకున్న బ్లాక్ బస్టర్.!
[KAAKA Dubbing Starts, Kaaka Movie Dubbing, Megastar Chiranjeevi, Bobby Kolli, Kaaka Movie, Chiranjeevi Kaaka, Telugu Film News, Telugu News]




