Home

»

Latest News

ఇదిగో 'గాడ్‌ఫాద‌ర్' లుక్‌!

Jul 4, 2022 6:13PM

 

చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'గాడ్‌ఫాద‌ర్‌'లో ఆయ‌న ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. మోహ‌న్‌రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోమ‌వారం రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కుర్చీలో కూర్చొని దీర్ఘాలోచ‌నలో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు చిరంజీవి. క‌ళ్ల‌కు గాగుల్స్ పెట్టుకొని న‌డివ‌య‌సు వ్య‌క్తి రూపంలో ఉన్నారాయ‌న‌. ఈ మూవీకి ఒరిజిన‌ల్ అయిన మ‌ల‌యాళం సినిమా 'లూసిఫ‌ర్‌'లో ఇదే రోల్‌ను చేసిన మోహ‌న్‌లాల్ ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లుక్‌లో క‌నిపిస్తారు. అదీ కూడా వైట్ ష‌ర్ట్‌, వైట్ లుంగీలోనే క‌నిపిస్తారు. రీమేక్‌లో అందుకు భిన్న‌మైన ఆహార్యాన్ని చిరంజీవి మెయిన్‌టైన్ చేస్తున్న‌ట్లు ఊహించ‌వ‌చ్చు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రంలో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే విధంగా ఇద్ద‌రు స్టార్ల‌పై ఓ స్పెష‌ల్  సాంగ్ వుంది. ఈ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా, ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. లేడీ సూప‌ర్‌స్టార్‌ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ డైరెక్ట‌ర్‌ పూరి జగన్నాథ్‌ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్  కోసం పని చేస్తున్నారు. పాపుల‌ర్‌ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com