Home

»

Latest News

Mega 158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. ఘనంగా 'మెగా 158' మూవీ లాంచ్!

May 21, 2026

మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి  కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మెగా 158' (Mega 158) పూజా కార్యక్రమాలతో గురువారం (మే 21, 2026) హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. 

ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఓ అపురూపమైన ద్యశానికి వేదికగా నిలిచింది. మెగా పవర్ హౌస్ మొత్తం ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులకు పూనకాలు వచ్చాయి.

ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఐకానిక్ మెగా బ్రదర్స్ — మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు కలిసి హాజరై సందడి చేశారు. 

గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ముహూర్తపు వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టడం విశేషం. 

మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే వేదికపై పక్కపక్కన నిలబడి నవ్వుతూ కనిపించిన విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. #Mega158, #KVNTeluguDebut హాష్ ట్యాగ్‌లు నెట్టింట క్షణాల్లో టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లాయి.

ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ కోసం మెగాస్టార్ చిరంజీవి తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కసరత్తులు చేసి, బరువు తగ్గి (Weight Loss for Mega 158) ఎంతో ఫిట్‌గా, వింటేజ్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. డైరెక్టర్ బాబీ ఈసారి చిరంజీవిని మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నట్లు సమాచారం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎస్.ఎస్. థమన్ (Thaman S) సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. ఈ మెగా మాస్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com