Home

»

Latest News

Chiranjeevi: మెగా 158 లో మరో క్రేజీ భామ!..ఇదే నిజమైతే మంచి బ్రేక్ వచ్చినట్లే 

May 29, 2026 10:39AM

 


మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),బాబీ(Bobby)కాంబోలో రూపొందుతున్న మెగా 158 అలా స్టార్ట్ అయ్యిందో లేదో, శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లోని హై కోర్ట్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో చిరు అండ్ కూతురుగా చేస్తున్న అనశ్వర రాజన్(ANaswara Raajan)పై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఇప్పుడు  మరో  ఎంపిక అయ్యిందనే న్యూస్ సోషల్ మీడియా అండ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

 'మెంటల్ మదిలో', 'చిత్రలహరి', 'అల వైకుంఠపురములో చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారిన 'నివేదా పేతురాజ్(Nivetha Pethuraj)కి మెగా 158 లో  చాలా పవర్‌ఫుల్ రోల్ దక్కినట్లు తెలుస్తోంది. కథని మలుపు తిప్పే ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో లేదా మెగాస్టార్ సరసన ఒక ప్రత్యేకమైన ట్రాక్‌లో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. బాబీ  తన సినిమాల్లో ప్రతి క్యారక్టర్ కి ఒక బలమైన జస్టిఫికేషన్ ఇస్తారు. ముఖ్యంగా మహిళా క్యారెక్టర్స్ ని కేవలం పాటలకే  పరిమితం చేయకుండా కథలో భాగం చేస్తారు. ఈ మూవీలో కూడా నివేదా పేతురాజ్ క్యారక్టర్  దాదాపు 35 నిమిషాల పాటు స్క్రీన్ స్పేస్ కలిగి ఉంటుందని, హీరోకి  సమానంగా ఎలివేషన్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇదే నిజమైతే చిరంజీవి లాంటి లెజెండరీ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నివేదిత కెరీర్‌ కి మంచి బ్రేక్ వచ్చినట్టే. నివేదిత రీసెంట్ గా వెంకటేష్, త్రివిక్రమ్ మూవీలో కూడా ఒక కీలక రోల్ కి ఎంపిక అయిన విషయం తెలిసిందే.

also read:  urvashi rautela: ఆ బడా హీరోయిన్స్  పట్టుకున్న ఊర్వశి రౌతేలా!.. ఈ పిక్ అందుకు సాక్ష్యం

ఇక 158 నిర్మాణ విలువలు చాలా భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.జనగణమన ఫేమ్ కే విఎన్ ప్రొడక్షన్స్  సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది  శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేసి 2027 సంక్రాంతికి థియేటర్స్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com