ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి
on Jun 10, 2025
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ని ముగించుకుంది. ఈ మూవీ ద్వారా చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో చేస్తుండటంతో ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక జూన్ 21 న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిరంజీవి ఎక్స్(X)వేదికగా పోస్ట్ చేస్తు 'ఫోకస్ వల్ల ఫిట్ నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఫోకస్, ఫిట్ నెస్ రెండు వస్తాయి. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని సెలబ్రేట్ చేసుకుందామని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు.
ఇక చిరు అప్ కమింగ్ మూవీ'విశ్వంభర' తుది మెరుగులు దిద్దుకొని విడుదలకి సిద్దమవుతుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా వార్తలు వస్తున్న విశ్వంభర, సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా త్రిష(Trisha)ఆషికా రంగనాధ్, ఈషా చావ్లాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్రల్లో చేస్తున్నారు. చిరు ప్రీవియస్ మూవీ 'భోళా శంకర్' పరాజయం తర్వాత వస్తున్న 'విశ్వంభర' పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా బింబిసార ఫేమ్ వశిష్ఠ (Vasishta)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
