Home

»

Latest News

థియేటర్లలో విడుదలైన రెండు రోజులకే యూట్యూబ్‌లోకి వచ్చేసిన మూవీ!

Jun 29, 2026 12:51PM

ఇటీవల కాలంలో మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే తాజాగా ఒక తెలుగు సినిమా మాత్రం.. థియేటర్లలో విడుదలైన రెండు రోజులకే యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చి షాక్ ఇచ్చింది.

తల్లాడ సాయికృష్ణ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'చెట్టు కింద దెయ్యం నాకేం భయం' (Chettu Meedha Dhayyam Nakem Bhayam). జూన్ 26న ఈ సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలైంది. అయితే ఊహించని విధంగా జూన్ 28 సాయంత్రం యూట్యూబ్‌లోకి వచ్చేసింది.

దీనిపై తల్లాడ సాయికృష్ణ స్పందిస్తూ.. తమ సినిమా తక్కువ థియేటర్లలో విడుదలైందని, ఎక్కువమందికి చేరువ కావాలనే ఉద్దేశంతో ఇలా యూట్యూబ్ లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మరి యూట్యూబ్‌లో ఈ మూవీ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com