Home

»

Latest News

వినాయ‌క చ‌వితికి 'చంద్రముఖి 2'.. లారెన్స్ విశ్వరూపం చూపిస్తాడా?

Aug 1, 2023 3:45PM

కొరియోగ్రాఫ‌ర్‌ గా, డైరెక్ట‌ర్‌ గా, యాక్ట‌ర్ గా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన 'చంద్ర‌ముఖి' చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు 'చంద్రముఖి 2' సినిమాను రూపొందిస్తున్నారు. 

ఈ సినిమా నుంచి తాజాగా రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ను గమనిస్తే.. రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. ఆ లుక్ లో పొగరు, రాజసంతో పాటు కూర్ర‌త్వం కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. లుక్‌లోనే ఈ రేంజ్ ఉంటే, లారెన్స్ త‌న‌దైన న‌ట‌న‌తో సినిమాలో ఎలా ఆక‌ట్టుకుంటార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోన్న అంశం.  

2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన 'చంద్ర‌ముఖి' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే.  దానికి సీక్వెల్‌గా 'చంద్రముఖి 2' రానుంది. భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న 'చంద్రముఖి 2' చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ గా, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com