
'కలర్ ఫోటో'తో తన కట్ అవుట్ రేంజ్ పెంచుకున్న అచ్చ తెలుగు ముద్దుగుమ్మ చాందిని చౌదరి. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చేసినా హిట్ అందుకోలేకపోయింది. తన పెర్ఫార్మ్ పై మొత్తం వంక పెట్టిన ప్రేక్షకుడు లేడు. చాందిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టి సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది.
చాందిని మాట్లాడుతు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా రెండవ సినిమా షూటింగ్ కి ముందు కథ చెప్పినప్పుడు దర్శకుడు, నిర్మాతలు ఎలాంటి ముద్దులు, రొమాంటిక్ సీన్ల గురించి చెప్పలేదు. దాంతో మంచి కథే కదా అని నమ్మి ఆ ప్రాజెక్ట్‌కి సంతకం చేశాను. అయితే సెట్స్ కి వెళ్లిన తర్వాత అంతా తలకిందులైంది. సెట్స్‌లో డైరెక్టర్ మరియు ప్రొడక్షన్ టీమ్ ఒక్కసారిగా సీన్ మార్చి, స్క్రిప్ట్‌లో లేని ముద్దు సీన్, కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ సమయంలో టాలీవుడ్‌లో 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ అయ్యి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఆ సినిమా విజయాన్ని చూసిన సదరు చిత్ర యూనిట్, తమ సినిమాలో కూడా అలాంటి ఘాటు రొమాంటిక్, కిస్ సీన్స్ పెడితే సినిమాకు విపరీతమైన హైప్ వస్తుందని భావించారు. "ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది ఒక ట్రెండ్ నడుస్తోంది.. ఇలాంటి సీన్స్ చేస్తేనే సినిమా బాగా వర్కౌట్ అవుతుంది, బిజినెస్ జరుగుతుంది" అంటూ నన్ను కన్విన్స్ చేయడానికి, బలవంత పెట్టడానికి ప్రయత్నించారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటి కావడం, పైగా కెరీర్ మొదటి దశలోనే ఉండటంతో అలా ఒత్తిడి చేయడం వల్ల ఆ సీన్ చేయకపోతే ఎక్కడ అన్‌ప్రొఫెషనల్ అని ముద్ర వేస్తారో, అవకాశాలు పోతాయో అని తీవ్రమైన భయాందోళనకి, సందిగ్ధంలో పడిపోయాను. అయితే ఆ క్లిష్ట సమయంలో సినిమా హీరో తీసుకున్న ఒక ఊహించని నిర్ణయంపెద్ద ఊరట ఇచ్చింది. తాను కూడా స్వయంగా ముందుకొచ్చి "నేను కూడా ఈ కిస్ సీన్ చేయను" అని డైరెక్టర్, టీమ్‌కి స్పష్టంగా చెప్పేశాడు. హీరో ఇచ్చిన ಆ మద్దతు వల్లే ఆ బలవంతపు సీన్ నుంచి బయటపడగలిగాను.
Also read: korean kanakaraju: కొరియన్ కనకరాజు తో వరుణ్ తేజ్ హిట్.. ప్లాప్ కాకుండా ఉండాలంటే ఇలా!
లేదంటే ఆ సీన్ చేయాల్సి వచ్చేదేమో అని చాందిని భావోద్వేగానికి లోనైంది. ఈ చేదు అనుభవం తర్వాత చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలాంటి సినిమా ఒప్పుకున్నా స్క్రిప్ట్ మొత్తాన్ని పక్కాగా అడిగి తెలుసుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
chandini chowdary, Tollywood






