Home

»

Latest News

పూరి జ‌గ‌న్నాథ్‌కు సెల‌బ్రిటీల బ‌ర్త్‌డే విషెస్‌.. డైరెక్ట‌ర్‌ త‌ర‌పున‌ చార్మి థాంక్స్‌!

Sep 28, 2021 12:34PM

 

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు నేడు (సెప్టెంబ‌ర్ 28). ఈ సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు, ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా విషెస్ చెబుతున్నారు. అయితే ఆ విషెస్‌కు పూరి స్పందించ‌డం లేదు. ఆయ‌న‌కు బ‌దులుగా ఆయ‌న పార్ట‌న‌ర్ చార్మి రిప్లై ఇస్తున్నారు. అంద‌రికీ పూరి త‌ర‌పున ఆమె థాంక్స్ చెబుతుండ‌టం ఇండ‌స్ట్రీలో వింత‌గా చెప్పుకుంటున్నారు. ఎందుకో తెలీదు కానీ.. పూరి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను కొన్ని నెల‌లుగా ఉప‌యోగించ‌డం లేదు. చివ‌రి సారిగా ఆయ‌న ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ట్వీట్ చేశారు.

బ‌హుశా అందుకేనేమో, ఆయ‌న బ‌దులుగా సెల‌బ్రిటీల‌కు చార్మి రిప్లై ఇస్తున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు "Happy birthday @purijagan sir! Wishing you an incredible year filled with happiness & great health." అని విషెస్ చెప్ప‌గా, "Thank u so much .. love and respect. Puri garu says “LOVE U “ …" అంటూ చార్మి రిప్లై ఇచ్చారు.

అలాగే ఇస్మార్ట‌ హీరో రామ్, "Here’s wishing one of my favvvv humans..the thooppestttt director @purijagan  garu a very happy birthday! Love you sir.. #RAPO" అని ట్వీట్ చేయ‌గా, "Ustaaaaaaaddddddd thanks a ton. Puri garu says “ love u , you are my dynamite” అని స‌మాధాన‌మిచ్చారు చార్మి. హీరోలు స‌త్య‌దేవ్‌, కార్తికేయ‌, డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, బాబీ, హేమంత్ మ‌ధుక‌ర్‌, నిర్మాత‌-న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలుప‌గా వారికి థాంక్స్ చెబుతూ చార్మి రిప్లై ఇచ్చారు.

అంత‌కు ముందు పూరితో క‌లిసున్న ఫొటోను షేర్ చేసిన‌ చార్మి, "Happy birthday to my most favourite human the trust and belief u have over me , I hope I live upto it always n keep making u feel proud #purijagannadh #hbdpurijagannadh" అని ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. రెండు హార్ట్ ఎమోజీల‌ను కూడా జోడించారు. 

చార్మిని టైటిల్ రోల్‌లో చూపిస్తూ పూరి జ‌గ‌న్నాథ్ 'జ్యోతిల‌క్ష్మి' (2015) మూవీని తీశాక‌, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం పెరిగి, స‌న్నిహితుల‌య్యారు. ఆ త‌ర్వాత పూరి క‌నెక్ట్స్ పేరిట నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించిన చార్మి, ఆయ‌న తీసే సినిమాల ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటూ వ‌స్తున్నారు. ఆ ఇద్ద‌రి అనుబంధం గురించి ఇండ‌స్ట్రీలో ప‌లు ర‌కాలుగా మాట్లాడుకుంటున్నా, అవేమీ ప‌ట్టించుకోకుండా ముందుకు కొన‌సాగుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com