Home

»

Latest News

వందకోట్ల భారాన్ని మోయగలడా ?

Jun 30, 2016 5:29PM

అప్పటివరకూ మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క ఫ్లాపు కూడా లేని రాజమౌళే తాను దర్శకత్వం వహించే సినిమాకు నిర్మాతల చేత వంద కోట్ల పెట్టుబడి పెట్టించాలంటే కాస్తంత భయపడ్డాడు. ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాత నట్టేట మునగాల్సిందే. అయితే.. "బాహుబలి" పెట్టిన బడ్జెట్ కంటే ఆరింతలు లాభాలు తెచ్చెపెట్టిందనుకోండి. రాజమోళి కాబట్టి ఆ సాహసం చేయగలిగాడు. మరి కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన అనుభవం ఉన్న యువ దర్శకుడు సుజిత్ మరి వంద కోట్ల భారాన్ని మోయగలాడా. "బాహుబలి 2" అనంతరం ప్రభాస్ హీరోగా "రన్ రాజా రన్" ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించిన విషయం తెలిసిందే. తోలుత ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే తీద్దామనుకొన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రభాస్ కున్న స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకొని మల్టీపుల్ లాంగ్వేజస్ లో ఈ సినిమా తీయడానికి యువీ క్రియేషన్స్ సన్నద్ధమవుతున్నారు. వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. మరి సుజిత్ ఈ భారీన్ని మోయగలాడా?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com