Home

»

Latest News

మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటిటిలో ట్రెండింగ్ అవుతుంది.. అసలు మిస్ అవ్వకండి  

Jul 25, 2026 8:58PM

 

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసినా ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అయ్యే  హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత చాలా బలంగా ఉంది. అందుకు తగ్గట్టే తాడిని తన్నే వాడుంటే తలని తన్నేవాడు  ఉంటాడనే సామెతని నిరూపిస్తూ ఒక దాన్ని మించిన ఒక చిత్రం ఓటిటి లో  తన సత్తా చాటుతున్నాయి.  

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిత్యం కొత్త చరిత్రని సృష్టిస్తుంటాయి. ఆ వరుసలోనే వచ్చిన అత్యంత ఆసక్తికరమైన హారర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కగా  థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆధునిక కాలంలో కూడా కలర్ సినిమా కాకుండా, ఒక పీరియాడిక్ కథను మైండ్ బ్లాకింగ్ మోడ్‌లో కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో రూపొందించడం సినిమా మేకర్స్ చేసిన అతిపెద్ద సాహసంగా చెప్పవచ్చు. 139 నిమిషాల వ్యవధి కలిగిన ఈ సినిమా ప్రేక్షకులకు ప్రతి నిమిషం ఒక విభిన్నమైన, రోమాంచిత అనుభూతిని అందిస్తుంది.

థియేటర్లలో విశేష ఆదరణ పొందిన 'భ్రమయుగం' చిత్రం మార్చి 15 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో ప్రసారం అవుతూ ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. క్రిస్టో జేవియర్ అందించిన గూస్‌బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, షెహ్నాద్ జలాల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. మీరు కనుక సస్పెన్స్, హారర్, మైండ్ కేమ్, మిస్టరీ జానర్ సినిమాలనుష్టపడే వారైతే, సోనీ లివ్‌లో అందుబాటులో ఉన్న ఈ పీరియాడిక్ బ్లాక్ అండ్ వైట్ మాస్టర్‌పీస్‌ను ఖచ్చితంగా మిస్ కాకుండా వీక్షించాల్సిందే.

 కథాంశం విషయానికి వస్తే, 17వ శతాబ్దపు మలబారు తీర ప్రాంత నేపథ్యంతో సాగుతుంది. ఒక రాజ్యంలో కులపాటలు పాడుకునే దేవన్ అనే గాయకుడు యాదృచ్ఛికంగా అడవిలో దారి తప్పి, కుడుమన్ పొట్టి అనే ఒక వింతైన, అహంకారియైన జమీందారు మనవడి మనాలోకి చేరుకుంటాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవన్‌కు అనుకోని వింత పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా, అతనికి ఆ ఇంట్లో విధి ఆడే వింత ఆట స్పష్టంగా కనిపిస్తుంది. అసలు కుడుమన్ పొట్టి ఎవరు, ఆ మనాతో ఉన్న రహస్యమేమిటి, దేవన్ అక్కడ నుంచి సురక్షితంగా బయటపడగలిగాడా అనేదే ఈ సినిమా యొక్క అసలు ఉత్కంఠభరిత కథనం.


Also read: Triptii dimri: నా ప్రతిభ అందులో లేదంటున్న త్రిప్తి దిమ్రి..జెన్ జీ బ్యాచ్ వింటే ఏమవుతారో 

 మమ్ముట్టి అద్భుతమైన నటనను కనబరిచారు. కుడుమన్ పొట్టి క్యారక్టర్ లో   ఆయన చూపించిన క్రూరత్వం, శారీరక భాష, నవ్వు, మాట్లాడే తీరు ప్రేక్షకులను ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని ప్రకటించింది. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ప్రధానంగా కేవలం మూడే మూడు ముఖ్య పాత్రలతో కథను నడిపించడం, ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి పక్కకు తిప్పుకోకుండా కట్టిపడేయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ కలసి నిర్మించిన ఈ చిత్రం  27.73 కోట్ల బడ్జెట్‌తో అత్యంత నాణ్యమైన సాంకేతిక విలువలతో రూపొందింది.

Mammotty, Bramayugam

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com