
మస్సా మస్సా అంటూ ఆడుతూ పాడుతూ 'పెద్ది'(Peddi)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). అభిమానులు, ప్రేక్షకులకైతే స్క్రీన్ ప్లే పరంగా కొన్ని లోపాలు ఉన్నా చరణ్ అనే కట్ అవుట్ చేసిన వన్ మాన్ షో, పెద్ది క్యారక్టర్ కోసం పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం దొరికిందని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దృష్టి క్రమం క్రమంగా పెద్ది నుంచి సుకుమార్ తో చెయ్యబోయే చరణ్ నెక్స్ట్ మూవీపై పడింది.
‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అభిమానుల్లో ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ భారీ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ ప్రతి సీన్‌ని ఎంతో పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించేందుకు సమయం తీసుకుంటారనే పేరుంది. అల్లు అర్జున్‌తో చేసిన ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ ప్రాజెక్ట్‌లకు దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టడం, అది బాక్సాఫీస్ వద్ద రూ. 1,800 కోట్లకు పైగా వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసినప్పటికీ, RC17కి అంత సమయం పడితే రిలీజ్ ఏకంగా 2027 లేదా 2028కి వెళ్తుందేమోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
Also read: మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటిటిలో ట్రెండింగ్ అవుతుంది.. అసలు మిస్ అవ్వకండి
అయితే మైత్రీ మూవీ మేకర్స్ కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, అనవసరమైన ఊహాగానాలకు బ్రేక్ పడే సమయం వచ్చింది. సుకుమార్ ఇప్పటికే ‘RC17’ ఫైనల్ స్క్రిప్ట్‌ను పూర్తిస్థాయిలో లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి పీరియాడిక్ లేదా మాఫియా బ్యాక్‌డ్రాప్ లేకుండా, రెండు భాగాలుగా కాకుండా ఒకే ఒక్క పవర్ ప్యాక్డ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు; రంగస్థలంలో ‘చిట్టిబాబు’ పాత్రను మించిపోయే సరికొత్త అవతారంలో చరణ్‌ను చూపించేందుకు సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నారు.
Ram Charan, Sukumar, RC 17






