మహేశ్‌ను "మిస్టర్ M" అంటూ వర్మ చురకలు
on May 22, 2016
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఎవరిని వదలని రాము ఈ సారి సూపర్‌స్టార్ మహేశ్‌ను టార్గెట్ చేశాడు. ఇంతకు ముందు తాను విమర్శించే వాళ్ల పేర్లను డైరెక్ట్‌గా రాసే వర్మ. మహేశ్ విషయంలో మాత్రం ఎక్కడా ప్రిన్స్ పేరుగాని, బ్రహ్మోత్సవం అనే పేర్లను వాడకుండా చాలా జాగ్రత్తగా చురకలంటించాడు. బ్రహ్మోత్సవంలో మహేశ్ డ్యాన్స్ వీడియోని చూపిస్తూ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్స్ సేవియన్ గ్లోవర్, మార్తా గ్రాహం, జార్జ్ లాంటి వారు ఈ డ్యాన్స్ చూసి నేర్చుకోవాలి అంటూ ట్వీట్ చేశాడు.
ఇక ఫ్యామిలీ సినిమాను చూడటానికి వెళ్తే తండ్రి హీరోయిన్ అందం చూస్తాడు. తల్లి వాళ్ల దుస్తులను చూస్తుంది. కూతురు ధియేటర్లో కూర్చుని బాయ్‌ఫ్రెండ్‌తో చాట్ చేస్తుంది. కొడుకు నిద్రపోతాడు. ఈ విషయాన్ని "మిస్టర్ ఎమ్" తెలుసుకోవాలి. శోభన్‌బాబు లాంటి స్టార్లు మాత్రమే ఫ్యామిలీ సినిమాలు చేస్తారు. కృష్ణ, ఎన్టీఆర్‌లు కాదు. నాకు శోభన్‌బాబు దేవతలో హీరో గుర్తులేడు. కృష్ణ, ఎన్టీఆర్‌ల సినిమా స్టోరీ గుర్తు లేదు. వాళ్లే గుర్తున్నారు. "మిస్టర్ ఎమ్" స్టార్డమ్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. అంటూ ట్వీట్ చేశాడు. చివరిలో తన కామెంట్స్‌ను ఎమ్ ఫ్యాన్స్ పాజిటివ్‌గా తీసుకోవాలని కోరాడు.
Also Read