
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గత వీకెండ్‌లో ప్రేక్షకులను పలకరించిన సినిమాలలో 'బ్లాస్ట్ జోన్' (తమిళంలో 'బ్లాస్ట్') ఊహించని రీతిలో దూసుకుపోతోంది. సీనియర్ నటుడు అర్జున్ (Arjun) ప్రధాన పాత్రలో వైవిధ్యమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా, పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. (Blast Zone Collections)
కేవలం తమిళనాటనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక మరియు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. ఒక చిన్న సినిమాకు ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. (Blast Movie Collections)
ముఖ్యంగా ఈ చిత్రానికి నాలుగో రోజున వచ్చిన సండే అడ్వాంటేజ్ గట్టిగా ప్లస్ అయిందని చెప్పాలి. ఆదివారం సెలవు దినం కావడంతో అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, నాలుగో రోజున ఈ సినిమా ఏకంగా ఒక కోటి రూపాయలకు పైగా గ్రాస్ మార్కును అందుకుని బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది.
దీంతో కేవలం మొదటి లాంగ్ వీకెండ్‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను, అలాగే రూ. 1.25 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి తెలుగు గడ్డపై ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, నాలుగో రోజు ఆదివారం నాడే ఈ సినిమా దాదాపు రూ. 8 కోట్ల రేంజ్ లో భారీ గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఎక్స్‌లెంట్ ట్రెండ్‌ను ప్రదర్శించింది. ఈ చిత్రానికి సంబంధించి ఏరియాల వారీగా 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్ల లెక్కలను గమనిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. తమిళనాడులో అత్యధికంగా రూ. 9.40 కోట్లు రాగా, కేరళలో రూ. 2.55 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.50 కోట్లు, కర్ణాటకలో రూ. 1.65 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.15 కోట్లు వసూలయ్యాయి. అదేవిధంగా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటుతూ ఏకంగా రూ. 5.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
దీంతో ఓవరాల్‌గా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ముగిసే సమయానికి 'బ్లాస్ట్ జోన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 21.40 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. షేర్ పరంగా చూసుకుంటే దాదాపు రూ. 9.75 కోట్ల షేర్ వసూళ్లు ఈ సినిమా ఖాతాలో చేరాయి.






