మహేష్ హీరోయిన్ పెళ్లి శుభలేఖ చూశారా..!
on Apr 10, 2016
టక్కరి దొంగ లో మహేష్ సరసన చిందేసిన బిపాసా బసు, ఆ తర్వాత బాలీవుడ్ లో మంచి ప్లేసే సంపాదించుకుంది. కానీ అక్కడ వరస హిట్లు లేక డీలాపడింది. జాన్ అబ్రహాంతో నడిపిన ప్రేమ వ్యవహారం పెటాకులైన తర్వాత, చాలా కాలం పాటు ఒంటరిగానే జీవితాన్ని గడిపేసింది. గత రెండు మూడేళ్లుగా కరణ్ గ్రోవర్ తో ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నా, అవన్నీ పుకార్లే అని కొట్టిపారేసింది. వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని వచ్చిన వార్తల్ని నిజంకాదు అంటూ ఖండిస్తూ వచ్చింది. కానీ రీసెంట్ గా వీళ్లిద్దరి పెళ్లి శుభలేఖను కరణ్ గ్రోవర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే శుభవార్త చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఏప్రిల్ 30 న సన్నిహితుల సమక్షంలో ఒక్కటవుతున్నాం. మాకు ప్రైవసీని గౌరవించిన వారందరికీ కృతజ్ఞతలు. మీ అందరి దీవెనలు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం అని కరణ్ గ్రోవర్ ట్వీట్ చేశాడు. కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో ముంబైలోని లోయర్ పారెల్ లో బిప్స్ గ్రోవర్ వెడ్డింగ్ జరగబోతోంది.