బింబిసారుడి కలెక్షన్ల తుఫాన్.. నాలుగు రోజుల్లోనే రూ.20 కోట్ల షేర్
on Aug 9, 2022
'బింబిసార'తో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా రూ.20 కోట్ల షేర్ క్లబ్ లో చేరాడు. 'బింబిసార' మూవీ ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.13.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'బింబిసార' నాలుగు రోజుల్లోనే 18.10 కోట్ల షేర్(28.20 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు రూ.6.30 కోట్ల షేర్, రెండోరోజు రూ.4.52 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.02 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ.. నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ 2.27 కోట్ల షేర్ తో దూకుడు చూపించింది. నాలుగు రోజుల్లో నైజాంలో రూ.6.55 కోట్ల షేర్(బిజినెస్ రూ.5 కోట్లు), సీడెడ్ లో రూ.3.96 కోట్ల షేర్(బిజినెస్ రూ.2 కోట్లు), ఆంధ్రాలో రూ.7.59 కోట్ల షేర్(బిజినెస్ రూ.6.50 కోట్లు) రాబట్టి అన్ని ఏరియాల్లో భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది.
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 1.23 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 1.52 కోట్ల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో రూ.20.85 కోట్ల షేర్(34.30 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.15.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే బయ్యర్లకు 5 కోట్ల ప్రాఫిట్స్ తీసుకురావడం విశేషం. ఫుల్ రన్ లో ఈ మూవీ బయ్యర్లకు మరో పది కోట్లు లాభాలు తెచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.
Also Read