Home

»

Latest News

Bandla Ganesh: పవన్ స్పూర్తితో తెలంగాణ నిరంజన్‌కి బండ్ల గణేష్ భారీ ఆర్థికసాయం 

Jun 17, 2026 2:27PM

 

బండ్ల గణేష్(Bandla Ganesh)అంటే నిర్మాత, నటుడు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)భక్తుడు మాత్రమే కాదు. ఇట్స్ ఏ బ్రాండ్ అనే విషయం తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులని  సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ రోజు వరంగల్ ఏరియాలోని  హన్మకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ కోరిక మేరకు తన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.   

కాసేపటి క్రితం నిరంజన్ గురించి బండ్ల గణేష్ ఒక లేఖ విడుదల చేసాడు. సదరు లేఖలో  17 ఏళ్ల వయసులోనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ దీనస్థితి నన్ను తీవ్రంగా చలింపజేసింది. ఆ బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున  5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను.  ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి కొండంత అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా దైవం పవన్ కళ్యాణ్ గారే నాకు అసలైన స్ఫూర్తి .పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ సమాజంలో వెనుకబడిన, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తపిస్తూ ఉంటారు. ఆయన ఆశయాలు,సేవా నిరతిని చూసి ప్రేరణ పొందే  5 లక్షల సహాయాన్ని నిరంజన్ వైద్యం కోసం అందజేస్తున్నాను. నిరంజన్  త్వరలోనే కోలుకుని, మళ్లీ సాధారణ జీవితాన్ని గడపాలని ఆకాంషిస్తున్నానని సదరు లేఖలో పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, నెటిజన్లు బండ్ల గణేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read: Gv prakash kumar:ఎక్స్ లో పోస్ట్ చేసిన వ్యక్తికీ ఆర్థిక సాయం.. బాసు మళ్ళీ మోసపోయాడా!

  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com