Home

»

Latest News

Samantha: సమంత తల్లి కాబోతుందా? ప్రెగ్నెన్సీ రూమర్లపై అసలు నిజం ఇదే!

Jun 17, 2026 2:34PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం తన సరికొత్త యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది. మూడు సంవత్సరాల విరామం తర్వాత సమంత వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో, సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. 

'మా ఇంటి బంగారం' విడుదల కోసం సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ తరుణంలో.. సోషల్ మీడియా వేదికగా సమంతకు సంబంధించిన ఒక వ్యక్తిగత వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న సమంత, ప్రస్తుతం తల్లి కాబోతోందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సామ్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి.

అయితే ఈ వైరల్ వార్తల వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సమంత కేవలం తన కెరీర్ పైనే పూర్తి దృష్టి పెట్టిందని, ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. సమంత ప్రెగ్నెన్సీ వార్తలపై త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com