
రామాయణ తన జోరుని ఇంచు కూడా తగ్గించకుండా పేరు పెట్టలేని తుఫాన్ ని బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తూ ఉంది. కేవలం 14 రోజుల్లోనే 1,500 కోట్ల మార్కుని అందుకొని ఇప్పుడు ఏకంగా 2,000 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో రెండవ పార్ట్ పై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేసేలా ప్రముఖ నటుడు అజింక్య దేవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి.
అజింక్య దేవ్ రామాయణలో మహర్షి విశ్వామిత్రుడిగా కనిపించాడు. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు మొదటి భాగం కథ రాయడానికి, షూటింగ్ పూర్తి చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి దాదాపు 9 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. ఇప్పుడు 'రామాయణ పార్ట్ 2' షూటింగ్ శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది.
మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత భారీ స్థాయిలో, ఉత్కంఠభరితంగా తెరకెక్కుతోందని, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
.webp)
మరోవైపు 'రామాయణ' కథని మూడో భాగంతో కూడా కొనసాగించే అవకాశం ఉందా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. దీనిపై అజింక్య దేవ్ స్పందిస్తూ, మూడో భాగం గురించి మేకర్స్ తనతో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం పంచుకోలేదని చెప్పారు. కానీ భవిష్యత్తులో గనుక మూడో భాగం తీస్తే తన పాత్రకు మరింత ప్రాధాన్యం దక్కుతుందని, అందుకే అలా జరిగితే ఎంతో సంతోషిస్తానని అన్నారు.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కలకలం: కత్తితో ఏం చేసాడంటే..షాక్ లో ఫ్యాన్స్!
అంతేకాదు, "మూడు భాగాలతో ఎందుకు ఆగిపోవాలి? ఏకంగా 5 భాగాలుగా తీసినా బాగుంటుంది, అలాంటి మహాకావ్యంలో మళ్లీ మళ్లీ భాగమవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

విశ్వామిత్రుడి పాత్ర కోసం తాను పడిన శారీరక శ్రమ గురించి కూడా అజింక్య దేవ్ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆ పాత్రలో ఎక్కువగా బేర్ బాడీతో కనిపించాల్సి రావడం వల్ల ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నానని చెప్పారు. సిక్స్-ప్యాక్ కోసం కాకుండా, ఒక మహర్షికి ఉండాల్సిన గంభీరత, దృఢత్వం తెరపై కనిపించేలా శరీరాన్ని తీర్చిదిద్దుకున్నానని వివరించారు.
దశరథ మహారాజు పాత్రలో అరుణ్ గోవిల్ వంటి దిగ్గజ నటుడితో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి అని, ప్రతి సన్నివేశంలోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమించానని అజింక్య దేవ్ తెలిపారు. మొత్తానికి 9 ఏళ్ల ప్రయాణం 1,500 కోట్ల కలెక్షన్లు, రాబోతున్న పార్ట్ 2లో సన్నీ డియోల్ హనుమంతుడి అవతారం—ఇవన్నీ 'రామాయణ'పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు:విన్నర్ ఎవరు...ఈ సినిమానేనా!
మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!
[Ajinkya Deo,Ramayana Part 2, Sunny Deol,Ranbir Kapoor,Yash]




