బాలయ్యది ఇప్పుడు స్టూడెంట్ పాత్ర..!
on Apr 19, 2016
నటసింహం నందమూరి బాలకృష్ణ స్టూడెంట్ అవతారం ఎత్తారు. ఏకలెక్కన పుస్తకాలు చదివేస్తూ ప్రిపేర్ అయిపోతున్నారు. ఆయనేమీ సినిమాలో స్టూడెంట్ రోల్ వేయడం లేదులెండి. తన వందో సినిమా కోసం, తనను తాను సన్నద్ధం చేసుకుంటూ, చరిత్ర పుస్తకాలను ఒక రౌండ్ వేసేస్తున్నారట బాలయ్య. గతంలో ఎన్టీఆర్ కూడా ఒక చారిత్రక లేదా పౌరాణిక పాత్ర వేయాలంటే, ఆ పాత్రకు సంబంధించిన ఆహార్యం, తీరుతెన్నులు లాంటివన్నీ పరిశీలించి, పరిశోధించి గానీ రోల్ వేసేవారు కాదట. తన వందో సినిమాకు బాలయ్య కూడా తండ్రి తరహాలో, గౌతమీ పుత్ర శాతకర్ణి గురించి పూర్తిగా స్టడీ చేస్తున్నారు. ఆ పాత్రకు రాజసం ఎలా ఉండాలి, ఎంత వరకూ రౌద్రాన్ని ప్రదర్శించాలి లాంటి వాటిలో కూడా బాలయ్య బాగా రిసెర్చ్ చేస్తున్నారట. ఒకరకంగా చెప్పాలంటే, క్రిష్ కు ఆ పాత్ర గురించి తనకు ఎక్స్ ప్లెయిన్ చేయాల్సిన బరువును తగ్గించేశారు బాలకృష్ణ. అసలే ఆయనకు చరిత్ర అన్నా, పురాణాలన్నా ఇష్టం. దీంతో వందో సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు నటసింహం..