Home

»

Latest News

శివశంకర్ మాస్టర్‌తో నాకు మంచి అనుబంధం!

Nov 28, 2021

 

కొవిడ్ 19 బారిన‌ప‌డి గ‌చ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ (72) ఆదివారం రాత్రి క‌న్నుమూశారు. ఆయ‌న మృతిప‌ట్ల హీరో నంద‌మూరి బాల‌కృష్ణ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో త‌న అనుబంధాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

"శివశంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయ‌న చాలా చ‌క్క‌ని వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయ‌న కొరియోగ్ర‌ఫీలో కొన్ని పాట‌ల‌కు డాన్స్ చేశాను. వాటికి ఎంతో పేరు వ‌చ్చింది. శివశంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను." అని బాల‌కృష్ణ అన్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com