Home

»

Latest News

బాలయ్య కోసం కొరటాల శివ మాస్టర్ ప్లాన్.. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్!

Jul 6, 2026 5:49PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సంచలన కాంబినేషన్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఫామ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో వరుసగా 4 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌ను శాసించిన కొరటాల శివకు, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య', 'దేవర' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. 

ముఖ్యంగా 'దేవర' పార్ట్ 1 నిరాశపరచడంతో కొరటాల శివ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్‌తో 'దేవర' పార్ట్ 2 చేయాల్సి ఉన్నప్పటికీ, తారక్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, అలాగే పార్ట్ 1 ఫలితం వల్ల కొరటాల శివ ఇప్పట్లో మెగాఫోన్ పట్టడం కష్టమేనని ఇండస్ట్రీ విశ్లేషకులు భావించారు. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో నందమూరి బాలకృష్ణ ఆయనకు ఊహించని విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్ద బూస్ట్ ఇచ్చారు. బాలయ్యలాంటి మాస్ హీరో ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఓకే చెప్పడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజాసేవలో బిజీగా గడుపుతున్నప్పటికీ, బాలకృష్ణ సినిమాలకు ఎక్కడా బ్రేక్ పడకుండా వరుసగా డేట్లు కేటాయిస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం బాలయ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగాన్ని పెంచేందుకు రాబోయే ఆగస్టు నెల మొత్తాన్ని (దాదాపు 30 రోజులు) పూర్తిగా కొరటాల శివకే కేటాయించారట. 

ఈ ఆగస్టు షెడ్యూల్‌లోనే సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌తో పాటు మెజార్టీ షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే పక్కా ప్రణాళికతో కొరటాల శివ ఉన్నట్లు సమాచారం. ఆచార్య, దేవర చిత్రాల ఫలితాల తర్వాత కొరటాల శివ ఈసారి ఏమాత్రం తప్పులు దొర్లకుండా ప్రతి విషయంలోనూ తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలకృష్ణతో సినిమా చేసేటప్పుడు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే పేరు ఇండస్ట్రీలో ఉంది. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఉపయోగించుకుని కొరటాల శివ తన పాత సక్సెస్ ట్రాక్‌ను మళ్లీ రీక్రియేట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.

కొరటాల శివ గత చిత్రాలను పరిశీలిస్తే హీరో పాత్రలు మరీ ఊర మాస్ లాగా కాకుండా, క్లాస్ టచ్‌తో చాలా సెటిల్డ్‌గా, మోడరేట్ తరహాలో ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణను కూడా అదే తరహా సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారట. బాలయ్య మార్క్ పవర్‌ఫుల్ మేనరిజమ్స్, గెటప్స్ కోరుకునే అభిమానుల కోసం కథలో అవసరమైన చోట హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేస్తూ, ఫ్యాన్స్‌కు 'ఫుల్ మీల్స్' లాంటి సినిమా ఇచ్చేందుకు కొరటాల ఏకంగా 4 నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ అవతార్‌లోనే కనిపిస్తూనే బాలయ్య క్యారెక్టర్ ఎంతో హుందాగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుందని టాక్. 

 

 

Nandamuri Balakrishna, Koratala Siva, NBK, Devara Part 2, Tollywood Movie News

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com