
కేజీఎఫ్' తో పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యష్(yash)తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లేడీస్ టీజర్ మరియు విడుదల తేదీ అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి సోషల్ మీడియాలో నెగెటివిటీ, వివాదాలు చుట్టుముట్టాయి. యాక్షన్ కంటెంట్ ఆశించిన అభిమానులకి టీజర్‌లో కనిపించిన మితిమీరిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తీవ్ర నిరాశని మిగిల్చాయి.
నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, విజువల్స్ కాస్త శృతిమించినట్టు ఉన్నాయంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు యష్ గతంలో చేసిన ఒక సంచలన వ్యాఖ్యానాన్ని తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఒక టాక్ షోలో యష్ మాట్లాడుతూ, "నేను నా తల్లిదండ్రులతో కలిసి కూర్చుని చూడలేని ఏ ఒక్క సీన్ కూడా సినిమాలో చేయను, అది నా సిద్ధాంతం. ఒకప్పుడు రొమాంటిక్ సీన్స్ చేయాలంటేనే ఎంతో సిగ్గుపడేవాడిని, హెల్మెట్ పెట్టుకుని పార్కుల్లో ప్రేమికులని గమనించి నటన నేర్చుకున్నానని కూడా నవ్వుతూ పంచుకున్నారు. కానీ ఇప్పుడు 'టాక్సిక్' సినిమాలో ఏకంగా సెన్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో, "ఆనాడు చెప్పిన మాటలు ఏమయ్యాయి యష్? మీ పాత ఒట్టును మీరే మర్చిపోయారా?" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.ఈ తీవ్రమైన ట్రోలింగ్ మరియు వివాదాలపై చిత్ర కథానాయిక హుమా ఖురేషి తాజాగా స్పందించారు.
నెటిజన్లు కాస్త ఓపిక పట్టాలని, సినిమా ఇంకా ఎవరూ చూడలేదు కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రావడం తగదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు మహిళా దర్శకుల మాట వినడానికి ఇష్టపడరని, కానీ యష్ మాత్రం గీతూ మోహన్ దాస్ ప్రతిభను నమ్మి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని ప్రశంసించారు. మరోవైపు, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో కొన్ని అభ్యంతరకర విజువల్స్‌పై ఇప్పటికే కర్ణాటక మహిళా కమిషన్ మరియు సెన్సార్ బోర్డ్‌కు ఫిర్యాదులు కూడా అందాయి. ఎన్నో వాయిదాల తర్వాత, మిడిల్ ఈస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందులను దాటుకుని ఈ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
yash, toxic, geethumohandas





