టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత కాలంలో వెండితెరపై స్టార్స్‌గా మారిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ఒక తెలుగు అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం తన గ్లామర్, నటనతో ఒక ఊపు ఊపేస్తుండటం నిజంగా విశేషం. ఆ అరుదైన ఘనత సాధించిన బ్యూటీనే అవంతికా వందనపు.
కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగిన ఈ తెలుగు తేజం, చిన్నతనంలోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం', అక్కినేని నాగచైతన్య 'ప్రేమమ్' వంటి సినిమాల్లో క్యూట్ లుక్స్‌తో బుజ్జి పాపలా కనిపించి అప్పట్లోనే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో హోమ్లీగా కనిపించిన ఈ అమ్మడు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఒక సెపరేట్ బ్రాండ్‌గా ఎదిగింది.
సినిమాల్లో బాలనటిగా అలరించిన తర్వాత ఈమె తిరిగి అమెరికా వెళ్లి హాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీ 'స్పిన్'లో ప్రధాన పాత్ర పోషించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మ్యూజికల్ కామెడీ ఫిల్మ్ 'మీన్ గర్ల్స్'లో 'కరెన్ షెట్టి' అనే పాత్రతో గ్లోబల్ వైడ్‌గా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా, 'టారోట్' అనే సూపర్ నేచురల్ హారర్ చిత్రంలో 'పెయిజ్' అనే పాత్రలో వైవిధ్యమైన నటనతో భయపెట్టి ప్రేక్షకులను మెప్పించింది.
రీసెంట్‌గా హులు ప్లాట్‌ఫామ్‌లో మిండీ కాలింగ్ క్రియేట్ చేసిన 'నాట్ సూటబుల్ ఫర్ వర్క్' అనే వెబ్ సిరీస్‌తో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. ఇందులో 'అభినయ అబ్బి చిలుకూరి' అనే స్టైలిస్ట్ క్యారెక్టర్‌లో అవంతిక నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో టాప్ పొజిషన్‌లో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డిస్నీల్యాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
ఒకప్పుడు టాలీవుడ్ స్క్రీన్‌పై చిన్న పాత్రల్లో మెరిసిన ఈ తెలుగమ్మాయి, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గ్లామర్ బాంబ్‌లా మారిపోవడం చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ మేకోవర్ అసలు ఊహించలేదంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. హాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న అవంతికా వందనపు, త్వరలోనే టాలీవుడ్‌లోకి స్టార్ హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.






