Home

»

Latest News

Barabar Premistha: ఓటీటీలో దూసుకుపోతోన్న ఆటిట్యుడ్ స్టార్ మూవీ!

May 9, 2026 6:27PM

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ మూవీ 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్ గా నటించారు. 'ఇష్టంగా' ఫేమ్ అర్జున్ మహీ విలన్‌గా మెప్పించారు. 

'బారాబర్ ప్రేమిస్తా' మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సి.సి. క్రియేషన్స్, ఎ.వి.ఆర్. మూవీ వండర్స్ బ్యానర్స్ పై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎ.వి.ఆర్ నిర్మించారు. 

థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ, రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎంఏ తిరుపతి కథ, రమేష్ రాయ్ మాటలు అందించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమాకు కెమెరామెన్‌గా వైఆర్ శేఖర్, ఎడిటర్‌గా బొంతల నాగేశ్వరరెడ్డి వర్క్ చేశారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com