Home

»

Latest News

Ashu Reddy: షాకిచ్చిన అషు రెడ్డి.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్.. ఎవరా వ్యక్తి?

May 08, 2026

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి (Ashu Reddy) ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకర్షించే అషు, తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలను చూస్తుంటే అషు రెడ్డి నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో ఒక మిస్టరీ మ్యాన్ తో ఆమె చేతులు కలిపి ఉండటం, వేలికి ఉంగరం మార్చుకోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉన్న ఒక ఫోటోలో అషు రెడ్డి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుండగా, మరో ఫోటోలో ఒక వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉండటం చూడవచ్చు. దీంతో అషు రెడ్డికి నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్ళి పేరుతో మోసం చేసిందంటూ ఇటీవల ఓ ఎన్ఆర్ఐ కుటుంబం, అషు రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో అషు రెడ్డి తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే కొందరు నెటిజన్లు ఇది కేవలం ఏదైనా టీవీ షో లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన ఫోటోషూట్ అయి ఉంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. నిజంగానే ఆమె నిశ్చితార్థం చేసుకుందా లేక ఇది కేవలం ప్రాంక్ మాత్రమేనా అన్నది అషు రెడ్డి స్వయంగా చెబితే తప్ప తెలియదు. ఏది ఏమైనా అషు రెడ్డి మరోసారి సోషల్ మీడియాను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com