Home

»

Latest News

కృష్ణమ్మగా అదరహో అనిపించిన జేజమ్మ!

Aug 6, 2016 12:46PM

ఇండస్ట్రీలో హీరోయిన్లందరిదీ ఒక లెక్క, అనుష్కది ఒక లెక్క. కెరీర్ తొలినాళ్లలో అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అనుష్క అనంతరం "అరుంధతి"తో చక్రం తిప్పింది. అందంతోనే కాక అభినయంతోనూ అదరగొట్టింది. "అరుంధతి" తర్వాత అనుష్క ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్నుంచి చాలా సెలక్టెడ్ గా సినిమాలు చేస్తూ తన ప్రియతమ కథానాయకుడు నాగార్జున నటించే అన్నీ సినిమాల్లోనూ నటిస్తూ వస్తోంది. మొన్నామధ్య "సైజ్ జీరో" కోసం కాస్త బరువు పెరిగినప్పటికీ.. వెంటనే "బాహుబలి 2" కోసం మళ్ళీ తగ్గింది.

తాజాగా నాగార్జున నటిస్తున్న మరో చిత్రం "ఓమ్ నమో వెంకటేశాయ"లోనూ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క "కృష్ణమ్మ" అనే పాత్రలో కనిపించనుంది. వెంకటేశుని పరామభక్తురాలు కృష్ణమ్మగా అనుష్క ఫస్ట్ ను విడుదల చేశారు. చాలా పద్ధతిగా కేరళ కుట్టిగా అనుష్క అదరహో అనే రేంజ్ లో ఉంది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com