Home

»

Latest News

అనసూయతో అఖిల్ డేటింగ్!

Aug 6, 2016 12:21PM

ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయతో అక్కినేని అందగాడు అఖిల్ డేటింగ్ చేస్తుందా? అని హెడ్డింగ్ చూసి ఫిక్సయిపోయి మనసులో ఏదేదో ఊహించేసుకోకుండా మేటర్ మొత్తం చదవండి. టీవి9లో త్వరలో ప్రసారమయ్యే "ఎ డేట్ విత్ అనసూయ" అనే ప్రోగ్రామ్ ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ షో కోసం మొదటి గెస్ట్ గా అఖిల్ బాబును ఎంపిక చేసుకొన్నారు టీవి9 వారు. ఈ టాక్ షోలో అఖిల్ చెప్పిన సంగతులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. శ్రేయా భూపాల్ తో తన ప్రేమ వ్యవహారం మొదలుకొని.. తన సెకండ్ సినిమా డీటెయిల్స్ వరకూ అన్నీ విషయాలను ఎంతో ఓపెన్ గా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఆదివారం (ఆగస్ట్ 7)న ప్రసారం కానున్న ఈ షో కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
ఇకపోతే.. అఖిల్ బాబు తన సెకండ్ సినిమా కోసం "కృష్ణగాడి వీరప్రేమగాధ" ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com