'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' మూవీ రివ్యూ
on Mar 6, 2020
నటీనటులు: ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్, సమీర్ తదితరులు
మాటలు: విజయ్ కామిశెట్టి
సినిమాటోగ్రఫీ: శేఖర్ గంగమోని
సంగీతం: వికాస్ బాడిస
నిర్మాతలు: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్
రచన-దర్శకత్వం: బాలు అడుసుమిల్లి
విడుదల తేదీ: 06 మార్చి 2020
'అమ్మాయిలం కదా! ఎన్నిసార్లయినా ఫ్రెష్ అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి','పోర్న్ చూడడం ఒక ఫీలింగే కదా' అని హీరోయిన్లు చెప్పే డైలాగులు, బెడ్ మీద రెండు నిమిషాలే శృంగారం చేసిన భర్తతో 'బావిలో బకెట్ వేసి ఎంప్టీ బకెట్ బయటకు తీయడం చాలా పాపం' అని భార్య చెప్పే డైలాగు చాలు... సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి! ట్రైలర్లలో ఇటువంటి డైలాగులు ఉండడంతో ఒక విధమైన సినిమాలు చూసే ప్రేక్షకుల్లో సినిమా ఆసక్తి కలిగించింది. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ:
ధాన్య బాలకృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగి. త్రిధా చౌదరి విలేకరి. కోమలీ ప్రసాద్ ఫ్యాషన్ డిజైనర్. సిద్ధీ ఇద్నాని దాంపత్య జీవితంలో సుఖం లేదని బాధపడే గృహిణి. చిన్నప్పటునుంచి ఈ నలుగురు స్నేహితులు. బోల్డ్ అమ్మాయిలు. గోవాలో ఫ్రెండ్ పెళ్లికి వెళతారు. అక్కడ తమ కోరికలు తీర్చుకోవడానికి ఒక అబ్బాయిని బుక్ చేసుకుంటారు. ఒక సందర్భంలో అతడు మరణించాడనుకుని బాడీని మాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఈలోపు పోలీస్ (సమీర్)కి నలుగురు అమ్మాయిలపై అనుమానం వస్తుంది. ఎలాగోలా తప్పించుకుని హైదరాబాద్ వస్తారు. తర్వాత ఎవరో వీరికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. వీళ్లకు మాత్రమే కాకుండా పోలీసుకీ బ్లాక్ మెయిల్ ఫోన్ కాల్స్ వస్తాయి. ఎవరిని ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? ఎవరితో ఎవరికి ఎఫైర్లు ఉన్నాయి? చివరికి, ఏమైంది? వంటి పలు గందరగోళ ప్రశ్నలకు సమాధానమే సినిమా.
విశ్లేషణ:
హాలీవుడ్ సినిమా 'రఫ్ నైట్' స్ఫూర్తితో 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' సినిమా తీశారు. అయితే... ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీయడంలో ఫెయిల్ అయ్యారు. మెట్రో పాలిటన్ సిటీల్లో అమ్మాయిలు ఎలా ఉంటారో చూపించాలనే తాపత్రయంలో బోల్డ్ డైలాగులు రాశారు. వాటిలో ఒక్క డైలాగ్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు. డైలాగుల్లో నవ్వు తెప్పించేవీ లేవు. ఈ సినిమాలో మేజర్ కామెడీ ట్రాక్, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'బావగారు బాగున్నారా' సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ను గుర్తు చేస్తుంది. ఆల్రెడీ చూసేసిన ట్రాక్ మళ్లీ కొత్తగా తీసి నవ్వించడం సాధారణమైన విషయం కాదు. మిగతా కామెడీ సన్నివేశాలు కూడా నవ్వించేలా లేవు. ఇల్లీగల్ ఎఫైర్లు అంటూ దర్శకుడు ఏదేదో చెప్పారు. హీరోయిన్లను ఉరుకులు పరుగులు పెట్టించిన సీన్స్ కూడా ఆకట్టుకోలేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో చెప్పుకోదగ్గ ప్రతిభ ఎవరు చూపించలేదు. రీ రికార్డింగ్ పరంగా కొన్ని సన్నివేశాలు పర్వాలేదు. పాటలు మాత్రం బాలేదు. ట్విస్టులు ఏవీ పేలలేదు.
ప్లస్ పాయింట్స్:
కోమలి ప్రసాద్, సిద్ధీ ఇద్నాని
అక్కడక్కడా సంగీతం
మైనస్ పాయింట్స్:
కథ
బోరింగ్ స్క్రీన్ ప్లే
నవ్వులు రాని కామెడీ
పాటలు
డైలాగులు
నటీనటుల పనితీరు:
నలుగురు హీరోయిన్లలో కోమలి ప్రసాద్, సిద్ధీ ఇద్నాని బాగా చేశారు. వాళ్లు ఇద్దరికీ మంచి సన్నివేశాలు కొన్ని పడ్డాయి. తమ నటనతో వాటిని ఇంకొంచెం బాగా చేశారు. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి ఏదో చేశామంటే చేశామన్నట్టు చేశారు. గ్లామర్ పరంగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేవు. సమీర్ రొటీన్ క్యారెక్టర్ చేశారు. చోటా మోటా ఆర్టిస్ట్ బాషాకు చెప్పుకోదగ్గ పాత్ర లభించింది.
తెలుగుఒన్ పర్ స్పెక్టివ్:
బోల్డ్ డైలాగులు, అమ్మాయిల అందాల ఆరబోతతో ఒక వర్గం ప్రేక్షకులను ఆకర్షించి క్యాష్ చేసుకునే ప్రయత్నం ఈ సినిమా.
ఈ కాన్సెప్ట్, అందులో కామెడీ క్లిక్ అయితే సినిమా సూపర్ హిట్ అయ్యేది. కామెడీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉండడంతో కాన్సెప్ట్ కంగాళీ అయింది. సినిమా బోరింగ్ గా మారింది.
రేటింగ్: 1.5/5