Home

»

Latest News

ఓటీటీలోకి 'అంటే సుందరానికీ'

Jul 3, 2022 7:24PM

నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన 'అంటే సుందరానికీ' నెలరోజులకే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికీ జూన్ 10న విడుదలై పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా నాని కామెడీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. జులై 10 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేకా సాగర్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మి, ఎడిటర్ గా రవితేజ గిరజాల వర్క్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com