
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ (Raaka). అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రాకా’ ఫస్ట్ లుక్ పోస్టర్, అందులో ఆయన కనిపించిన 'వేర్ వోల్ఫ్' (Werewolf) షేడ్స్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్?
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను అట్లీ సంప్రదించినట్లు తెలుస్తోంది. కథను కీలక మలుపు తిప్పే పాత్ర కావడంతో, దానికి అక్షయ్ అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే 'జవాన్' సినిమాతో హిందీ బెల్ట్‌లో అట్లీకి మంచి క్రేజ్ ఉంది, దానికి తోడు అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ తోడవ్వడంతో అక్షయ్ కూడా ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
షాకింగ్ కాంబినేషన్స్:
కేవలం అక్షయ్ కుమారే కాకుండా, ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరుస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, ఇండియన్ స్క్రీన్‌పై ఇది అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుందనడంలో సందేహం లేదు.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అని, మైథాలజీ అంశాలు కూడా మిక్స్ అయి ఉంటాయని టాక్. దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.





