Home

»

Latest News

AK 47: ‘ఆదర్శకుటుంబం’ నుంచి క్రేజీ అప్డేట్.. వెంకీ మామ కోసం త్రివిక్రమ్ అదిరిపోయే ప్లాన్!

May 03, 2026

విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శకుటుంబం: హౌస్ నెం. 47’ (AK 47) చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన హై-వోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. (Aadarsha Kutumbam House No 47)

యాక్షన్ మోడ్‌లో వెంకీ మామ:
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో కోసం అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి పూర్తిస్థాయి చిత్రం ‘ఆదర్శకుటుంబం’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

ఈ చిత్రానికి సంబంధించిన భారీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను మేకర్స్ తాజాగా పూర్తి చేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కెవిన్ కుమార్ నేతృత్వంలో కొన్ని రోజుల పాటు జరిగిన ఈ షూట్‌లో వెంకటేష్ పాల్గొని పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లలో మెరిశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇక కొన్ని టాకీ పార్ట్ సీన్లు మాత్రమే మిగిలి ఉండగా, త్వరలోనే సినిమా మొత్తం పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది.

థమన్ ఎంట్రీతో మారిన మ్యూజిక్:
ఈ ప్రాజెక్టు మ్యూజిక్ విషయంలో ఒక ఆసక్తికర మార్పు చోటుచేసుకుంది. మొదట హర్షవర్ధన్ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ బాధ్యతలను ఎస్.ఎస్. థమన్ స్వీకరించారు. త్రివిక్రమ్-థమన్ కాంబో అంటే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ కావడంతో, ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com